Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాయ్‌ఫ్రెండ్‌తో ఏకాంతంగా ఉన్న కుమార్తె... కుటుంబ పరువు కోసం గొడ్డలితో నరికి చంపిన తండ్రి

దేశవ్యాప్తంగా పరువు హత్యలు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా మహిళలపై అధికంగా దాడులు, మానభంగాలు జరుగుతున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. ఈనేపథ్యంలో ఓ తండ్రి తన కుటుంబ పరువు కోసం వివాహి

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (15:19 IST)
దేశవ్యాప్తంగా పరువు హత్యలు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా మహిళలపై అధికంగా దాడులు, మానభంగాలు జరుగుతున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. ఈనేపథ్యంలో ఓ తండ్రి తన కుటుంబ పరువు కోసం వివాహిత అయిన కుమార్తెను గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటన యూపీలోని మహోబా జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
యూపీలోని మహోబా జిల్లా, కుల్పాహార్ ప్రాంతానికి చెందిన మూల్‌చంద్‌ అహిర్వార్‌ అనే వ్యక్తి కుమార్తె గీతా అహిర్వార్‌. ఈమెకు గత శనివారం వివాహం జరిగింది. గతేడాది ఝాన్సీలో బంధువుల శుభకార్యానికి వెళ్లిన గీతకు అక్కడ చెందిన సునీల్‌ అనే యువకుడితో పరిచయమేర్పడి... ప్రేమలో పడ్డారు. అప్పటినుంచి వారిద్దరూ తరచూ కలుసుకుని మాట్లాడుకుంటూ వచ్చారు. 
 
ఈ విషయం తండ్రి మూల్‌చంద్‌కు తెలియడంతో కుమార్తెతో పాటు.. సునీల్‌ను కూడా హెచ్చరించారు. అయినప్పటికీ గీత వివాహం తర్వాత కూడా సునీల్‌ కలుసుకుంటూ వచ్చారు. ఈక్రమంలో ఆదివారం అర్థరాత్రి మూల్‌చంద్‌ లేని సమయంలో తన ప్రియురాలిని కలుసుకునేందుకు సునీల్‌.. గీత ఇంటికి వెళ్లాడు. 
 
అపుడు వారిద్దరు ఏకాంతంగా ఉండటాన్ని చూసిన మూల్‌చంద్ ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంటనే ఇంట్లో ఉన్న గొడ్డలితో సునీల్‌, గీతలపై దాడి చేసి హత్య చేశాడు. నిందితుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments