Webdunia - Bharat's app for daily news and videos

Install App

కట్నంతో పాటు కారు ఇవ్వలేదు.. అంతే ట్రిపుల్ తలాక్ చెప్పాడు..

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2022 (18:33 IST)
ట్రిపుల్ తలాక్‌ను నిషేధం విధించినా.. తలాక్ చెప్పే వ్యక్తులు ఇంకా వున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో కట్నంతో పాటు కారు ఇవ్వలేదనే కారణంతో భార్యకు ఫోన్ చేసి ట్రిపుల్ తలాక్ చెప్పేశాడొక ప్రబుద్ధుడు. దీంతో, బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. భర్తతో సహా ఐదుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వివరాల్లోకి వెళ్తే రుబినా అనే మహిళకు ఇమ్రాన్ సైఫీతో పెళ్లైంది. వీరికి నాలుగేళ్ల పాప ఉంది. పెళ్లి జరిగి నాలుగేళ్లైనా.. భర్త, అత్తామామలు కట్నం కోసం వేధిస్తూనే ఉన్నారు. దీనిపై గత ఏడాదే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ క్రమంలో అత్తింటి వారు రాజీ చేసుకుని ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. కొన్ని రోజుల క్రితం రాజస్థాన్‌లో ఉద్యోగం అంటూ భార్యను పుట్టింట్లో వదిలి భర్త వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఫోన్ చేసి ట్రిపుల్ తలాక్ చెప్పాడు. మరోవైపు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసేందుకు సిద్దమవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments