Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్మశానవాటిక కాంప్లెక్స్ పైకప్పుకూలి 18 మంది మృత్యువాత

Webdunia
ఆదివారం, 3 జనవరి 2021 (17:36 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘాజియాబాద్‌ మురాద్‌నగర్‌లో శ్మశానవాటిక కాంప్లెక్స్‌ పైకప్పు కూలింది. ఈ ఘటనలో 18 మంది మృత్యువాతపడ్డారు. మరికొందరు శిథిలాలకింద చిక్కుకున్నారు. వీరిని స్థానికులు ప్రాణాలతో రక్షించారు. 
 
ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుక్కున్న వారిని రక్షించి సమీప దవాఖానలకు తరలించారు. భారీ వర్షం కారణంగా భవనం పిల్లర్‌ ఒక్కసారిగా కూలడంతో పైకప్పు కుప్పకూలి ప్రమాదం జరిగింది.
 
ఈ ఘటనపై యూపీ ముఖ్యమంత్రి  యోగి ఆదిత్యనాథ్‌ దిగ్భాంతి వ్యక్తం చేశారు. శిథిలాల కింద చిక్కుక్కున్న వారిని రక్షించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఘజియాబాద్‌ జిల్లా కలెక్టర్‌తోపాటు ఎస్పీని ఆదేశించారు. 
 
మృతుల కుటుంబాలకు అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. ప్రమాద జరిగిన సమయంలో శ్మశానవాటిక కాంప్లెక్స్‌ కింద 40 మందిపైగా ఉన్నట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments