Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్ద నోట్ల రద్దు ఓ మహాయజ్ఞం.. ఓ విప్లవాత్మకం : వెంకయ్య నాయుడు

దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్ల రద్దును కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గట్టిగా సమర్థించారు. ఈ నిర్ణయం చరిత్రాత్మకం, విప్లవాత్మకమన్నారు. పేదలకు మేలు చేసే ప్రతి పనిని తాము సమర్థమంతంగా అమలు చేస్తామ

Webdunia
బుధవారం, 23 నవంబరు 2016 (08:58 IST)
దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్ల రద్దును కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గట్టిగా సమర్థించారు. ఈ నిర్ణయం చరిత్రాత్మకం, విప్లవాత్మకమన్నారు. పేదలకు మేలు చేసే ప్రతి పనిని తాము సమర్థమంతంగా అమలు చేస్తామన్నారు. 
 
బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలు ప్రజల పక్షాన ఉంటారో, నల్లకుబేరులను కాపాడతారో తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలు నోట్ల రద్దును స్వాగతిస్తున్నారని గుర్తుచేశారు. ప్రసవ వేదనను అనుభవిస్తున్న ప్రజలకు తప్పకుండా శుభాలే జరుగుతాయన్నారు. 
 
ఒక మహాయజ్ఞం జరిగేటప్పుడు చిన్నచిన్న ఆటంకాలు సహజమేనని అన్నారు. పెద్దనోట్ల రద్దుతో రియల్‌ ఎస్టేట్‌ రంగానికి, పేద ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. పేరొందిన పెద్దపెద్ద కార్పొరేట్‌ కంపెనీలు కూడా అందుబాటు ధరల్లో గృహ నిర్మాణానికి ముందుకొస్తున్నాయని వెంకయ్య చెప్పుకొచ్చారు.
 
అదేసమయంలో ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్‌కు రాకుండా పారిపోయారంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ప్రధాని ఎల్లవేళలా పార్లమెంట్‌లోనే ఉంటున్నారని గుర్తుచేశారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments