Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశమంటే మట్టి కాదు.. దేశమంటే మనుషులోయ్... నిర్మలా సీతారామన్

ఠాగూర్
శనివారం, 1 ఫిబ్రవరి 2025 (12:00 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్‌లో ఎనిమిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.  శనివారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే ఆమె బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టి ప్రసంగిస్తున్నారు. నిర్మలమ్మ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది 8వ సారి కావడం విశేషం.
 
ఈ సందర్భంగా తన ప్రసంగాన్ని గురజాడ సూక్తితో ప్రారంభించారు. 'దేశమంటే మట్టి కాదు.. దేశమంటే మనుషులోయ్’ అంటూ తెలుగ కవి గురజాడ అప్పారావు సూక్తిని తన తొలి వాక్యాల్లో ప్రస్తావించారు.
 
ఈ బడ్జెట్ ప్రసంగానికి ముందు విపక్షాలు తీవ్ర నిరసన తెలపడంతో సభలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనపై చర్చ కోరుతూ విపక్షాలు నిరసన తెలిపాయి. అనంతరం సభ నుంచి కొంతమంది వాకౌట్‌ చేశారు. ఈ పరిణామాల మధ్యే బడ్జెట్‌ ప్రసంగం సాగుతోంది.
 
అంతకుముందు బడ్జెట్‌ ట్యాబ్‌ను తీసుకుని ఆమె రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిశారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు ప్రథమ పౌరురాలి అనుమతి తీసుకుని పార్లమెంట్‌కు చేరుకున్నారు. అక్కడ కేంద్ర కేబినెట్‌ సమావేశమై బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేసింది. అనంతరం వార్షిక పద్దును నిర్మలమ్మ సభకు సమర్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments