Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురుడు పోసుకున్న వెంటనే ఆధార్ - ఆస్పత్రుల్లోనే జారీ

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (12:36 IST)
దేశ పౌరుందరికీ ఆధార్ నంబరును కేంద్రం కేటాయిస్తుంది. ఇపుడు ప్రతి ఒక్కదానికి ఆధార్ నంబరును అనుసంధానం చేస్తున్నారు. పిల్లల చదువులకే కాదు.. ప్రభుత్వ సంక్షేమ పథకం పొందేందుకు, బ్యాంకు ఖాతా తెరిచేందుకు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేందుకు ఇలా ప్రతి ఒక్కదానికి ఆధార్ నంబరు తప్పనిసరి అయింది. 
 
దీంతో ఇకపై పుట్టిన వెంటనే ఆధార్ నంబరును జారీచేసేందుకు కేంద్రం సన్నాహాలు చేపట్టింది. ఈ నంబరును ఆస్పత్రుల్లోనే జారీ చేసేలా చర్యలు తీసుకోనుంది. ఇదే అంశంపై రిజిస్ట్రార్ ఆఫ్ బర్త్ విభాగం అధికారులతో చర్చలు జరుపుతోంది. 
 
నిజానికి ఐదేళ్ళలోపు చిన్నారులకు బయోమెట్రిక్ లేదు. అందువల్ల తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు ఆధార్ కార్డుతో దానిని అనుసంధానిస్తారు. ఐదేళ్ళ తర్వాత ఆ చిన్నారి బయోమెట్రిక్ తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
కాగా, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 99.7 శాతం మంది (137 కోట్లు)కి ఆధార్ కార్డులు జారీచేసిటన్టు చెప్పారు. ప్రతి యేడాది రెండు నుంచి రెండున్నర కోట్ల మంది జన్మిస్తున్నారని, వారికి పుట్టిన వెంటనే ఆధార్ నంబరును జారీ చేసేందుకు కృషి చేస్తున్నట్టు ఆధార్ సంస్థ సీఈవో సౌరభ్ గార్గ్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం