Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయ్‌పూర్ టైలర్ హత్య కేసు : 32 మంది ఐపీఎస్ అధికారులపై బదిలీవేటు

Webdunia
శుక్రవారం, 1 జులై 2022 (12:25 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్‌లాల్ హత్య కేసు ఉదంతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ హత్యపై దేశ వ్యాప్తంగా నిరసనలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి. దీంతో ప్రభుత్వం కన్నెర్రజేసింది.

సుమారు 32 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ హత్య కేసులో పోలీసులపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. 
 
కాగా, బీజేపీ నేత నుపుర్ శర్మకు మద్దతుగా వ్యాఖ్యలు చేసినందుకు టైలర్ కన్హయ్యను ఇద్దరు వ్యక్తులు దారుణంగా మెడ నరికి హత్య చేసిన విషయం తెల్సిందే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో రియాజ్ అక్తారీ, గౌస్ మొహ్మద్‌లను కూడా అరెస్టు చేశారు. 
 
ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ చేపట్టింది. పాకిస్థాన్‌లోని దావత్ ఏ ఇస్లామీ గ్రూపుతో నిందితులకు సంబంధాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు, ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపరచగా 14 రోజుల పాటు జ్యూడీషియల్ కస్టడీలోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం