Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లైట్‌లో కిటికీ పక్క సీటులో మహిళ.. వెనుక సీట్లో కూర్చొని 'అక్కడ' తాకిన ప్రయాణికుడు

మహిళలపై భూమిపైనే కాదు.. నింగిలోనూ భద్రత లేకుండా పోయింది. విమానంలో కిటికీ పక్క సీట్లో కూర్చొన్న మహిళా ప్రయాణికురాలికి.. వెనుక సీట్లో కూర్చొన్న ఇద్దరు ప్రయాణికులు తాకరాని చోట తాకారు. దీంతో ఆ మహిళా ప్యాస

Webdunia
గురువారం, 6 జులై 2017 (12:42 IST)
మహిళలపై భూమిపైనే కాదు.. నింగిలోనూ భద్రత లేకుండా పోయింది. విమానంలో కిటికీ పక్క సీట్లో కూర్చొన్న మహిళా ప్రయాణికురాలికి.. వెనుక సీట్లో కూర్చొన్న ఇద్దరు ప్రయాణికులు తాకరాని చోట తాకారు. దీంతో ఆ మహిళా ప్యాసింజర్ విమాన సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో జైలు ఊచలు లెక్కిస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
ఇటీవల ఢిల్లీ నుంచి ముంబైకు ఇండిగో 6ఈ 843 రకం విమానం కొంతమంది ప్రయాణికులతో బయలుదేరింది. ఈ మహిళ విమానంలో కిటికీ పక్క సీటులో కూర్చుంది. ఆమె వెనుక సీట్లలో కూర్చున్న మాలేగామ్, నాసిక్ పట్టణాలకు మోమిన్ అర్షద్ హుసేన్, ఫైజాన్ అంజూమ్ మహమ్మద్ ఫారూఖ్ అనే ఇద్దరు ప్రయాణికులు.. ముందు సీట్లో ఉన్న మహిళా ప్రయాణికురాలిని తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగికంగా వేధించారు. 
 
దీంతో ఆ మహిళా విమాన సిబ్బందికి ఫిర్యాదు చేయగా, క్రూ సిబ్బంది విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. విమానం ముంబైలో ల్యాండ్ కాగానే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు సిబ్బంది వచ్చి ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 354, 34ల కింద కేసు నమోదు చేశారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం