బీజాపూర్ - కాంకెర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 22 మంది మావోలు హతం

ఠాగూర్
గురువారం, 20 మార్చి 2025 (16:10 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ - దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో మరోమారు భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్, కాంకెర్ జిల్లాల్లో రెండు ఎన్‌కౌంటర్లలో 22 మంది మావోయిస్టులు హతమయ్యారు. మావోల దాడిలో ఓ జవాను మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. 
 
బీజాపూర్ - దంతెవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో పెద్దఎత్తున మవోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు అడవుల్లో గురువారం ఉదయం నుంచే కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో మావోలు ఎదురపడి కాల్పులు జరిపారు. దాంతో వారిపై భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లినట్టు అధికారులు తెలిపారు. 
 
ఘటనాస్థలం నుంచి 18 మంది మావోయిస్టులు మృతదేహాలతో పాటు తుపాకులు, భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని, భద్రతా సిబ్బంది వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తాయని అధికారులు చెప్పారు. అయితే, ఈ ఎదురుకాల్పుల్లో ఓ జవాను ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. 
 
ఇదేసమయంలో కాంకెర్ జిల్లాలోనూ మరో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఇక్కడ బీఎస్ఎఫ్, డీఆర్‌జీ బలగాలు సంయుక్తంగా జరిపిన కూంబింగ్ ఆపరేషన్‌‍లో నలుగురు మవోయిస్టులను మట్టుబెట్టాయి. ప్రస్తుతం రెండు జిల్లాల్లోనూ యాంటీ నక్సల్స్ ఆపరేషన్ కొనసాగుతుండటంతో మరణాలు సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments