Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ నటి జయశీలి దారుణ హత్య.. లైంగికదాడి.. ఆపై దిండుతో అదిమి..? కండోమ్ లభ్యం కావడంతో?

టీవీ సీరియల్ నటి, మోడల్ డీ జయశీలి (49) దారుణ హత్యకు గురైంది. చెన్నైలోని సాలిగ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. పక్కా ప్లాన్ ప్రకారం టీవీ నటిని హత్యచేసి బంగారం ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ఆదివారం

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2016 (13:00 IST)
టీవీ సీరియల్ నటి, మోడల్ డీ జయశీలి (49) దారుణ హత్యకు గురైంది. చెన్నైలోని సాలిగ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. పక్కా ప్లాన్ ప్రకారం టీవీ నటిని హత్యచేసి బంగారం ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ఆదివారం తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో ఆమె శవమై ఉండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 
 
సాలిగ్రామం పెరియార్ వీధిలో ఉన్న ఆమె ఫ్లాట్ నుంచి చెడువాసన రావడంతో పొరుగు వారు పోలిసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే 50 సవర్ల బంగారం మాయమైందని ఆమె సోదరుడు సెల్వరాజ్ తెలిపారు. మరోవైపు ఆమె ఒంటిమీద ఉన్న నకిలీ బంగారు ఆభరణాలు మాత్రం అలాగే ఉన్నాయని చెప్పారు. తెలిసిన వాళ్లే ఈ పని చేసివుంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 
ఇకపోతే.. జయశీలిపై లైంగికదాడి అనంతరం దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్టుగా తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఇమిటేషన్ గోల్డ్‌ని దుండగుడు టచ్ చేయకపోవడంతో పాటు, గదిలో పెర్ ఫ్యూం చల్లడం, సంఘటనా స్థలంలో కండోమ్ లభ్యం కావడం అనేక అనుమానాలకు తావిస్తోందని పోలీసు అధికారులు తెలిపారు. స్నిఫర్ డాగ్స్ సహాయంతో విచారణ మొదలుపెట్టారు.
 
చెన్నైలో సినీ నటీమణిల హత్యలు పెరిగిపోతున్నాయి. నటీమణులపై వేధింపులు పెచ్చరిల్లిపోతున్న నేపథ్యంలో యాంకర్ ప్లస్ నటి అయిన సబర్ణ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరవక ముందే జయశీలి హత్యకు గురికావడం కోలీవుడ్‌కు షాక్ ఇచ్చింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం