అమ్మ వర్ధంతి నుంచి చిన్నమ్మ మౌనవ్రతం.. దినకరన్ వెళ్లినా?

అక్రమాస్తుల కేసులో ఇరుక్కుని బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో వున్న చిన్నమ్మ శశికళ మౌనవ్రతం చేస్తున్నారట. జనవరిలో శశికళ తన మౌనవ్రతాన్ని విరమిస్తారట. ఈ సంవత్సరం ఫిబ్రవరి 15 నుంచి శశికళ జైలు జీవితాన్ని గడ

Webdunia
శుక్రవారం, 29 డిశెంబరు 2017 (09:04 IST)
అక్రమాస్తుల కేసులో ఇరుక్కుని బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో వున్న చిన్నమ్మ శశికళ మౌనవ్రతం చేస్తున్నారట. జనవరిలో శశికళ తన మౌనవ్రతాన్ని విరమిస్తారట. ఈ సంవత్సరం ఫిబ్రవరి 15 నుంచి శశికళ జైలు జీవితాన్ని గడుపుతుండగా, మొత్తం నాలుగేళ్ల శిక్షను అనుభవించాల్సి వుందన్న సంగతి తెలిసిందే. 
 
ఇకపోతే.. దివంగత ముఖ్యమంత్రి జయలలిత తొలి వర్ధంతి నుంచి జైలులో వున్న చిన్నమ్మ మౌనవ్రతాన్ని చేపట్టారని టీటీవీ దినకరన్ చెప్పారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో తాను సాధించిన విజయం తరువాత, ఆ ఆనందాన్ని తన అత్తతో పంచుకునేందుకు వెళ్లినా ఆమె మాట్లాడలేదన్నారు. 
 
డిసెంబర్ 5న జయలలిత తొలి వర్థంతి కాగా, ఆమెకు నివాళిగా నాటి నుంచి ఆమె ఈ వ్రతాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆర్కే నగర్ ఎన్నికల గెలుపు విషయాన్ని చెప్పేందుకు వెళ్లిని దినకరన్‌ను కేవలం చూపులతోనే పలకరించారని తెలిపారు. దాదాపు అరగంట సేపు దినకరన్, తాను చెప్పాలనుకున్న విషయాలను శశికళకు చెప్పి, ఆమె అభిప్రాయాలను చూపులతోనే తెలుసుకుని వచ్చారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: యుద్దం నేపథ్యంలో శంబాల ట్రైలర్‌.. ఆవిష్కరించిన ప్రభాస్

Allari Naresh: ప్రేమ, థ్రిల్ ఎలిమెంట్స్ తో అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ

Bhagyashree Borse: నక్షత్రాల మధ్య ఆటలాడుతూ, వెన్నెల్లో తేలియాడుతూ.. రామ్, భాగ్యశ్రీ బోర్సే

Mass Jatara Review: జరుగుతున్న కథతో ఫ్యాన్స్ ఫార్ములాగా మాస్ జాతర - మూవీ రివ్యూ

Allu Sirish and Nayanika: నయనిక రెడ్డితో అల్లు శిరీష్.. తారల సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments