Webdunia - Bharat's app for daily news and videos

Install App

మమతా బెనర్జీ పార్టీలో చీలిక.. ఆరుగురు ఎమ్మెల్యేలు గుడ్‌బై?

వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రపతి ఎన్నికలు చిచ్చుపెట్టాయి. దీంతో ఆ పార్టీ రెండుగా చీలిపోయే ప్రమాదం ఏర్పడింది. ముఖ్యంగా.. త్రిపురకు చెందిన ఎమ్మెల

Webdunia
గురువారం, 6 జులై 2017 (10:31 IST)
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రపతి ఎన్నికలు చిచ్చుపెట్టాయి. దీంతో ఆ పార్టీ రెండుగా చీలిపోయే ప్రమాదం ఏర్పడింది. ముఖ్యంగా.. త్రిపురకు చెందిన ఎమ్మెల్యేల్లో ఆరుగురు భారతీయ జనతా పార్టీలో చేరే సూచనలు కనిపిస్తున్నాయి. 
 
దీనికి కారణం లేకపోలేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థిగా బరిలో ఉన్న మీరా కుమార్‌కు మమతా బెనర్జీ మద్దతు పలికారు. దీన్ని త్రిపుర రాష్ట్రానికి చెందిన ఆరుగురు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. దీంతో వీరంతా బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. 
 
సీపీఎం మద్దతు తెలిపిన మీరాకుమార్‌కు ఓటేయడానికి వారు నిరాకరిస్తున్నారు. త్వరలోనే వారు బీజేపీలో చేరనున్న‌ట్లు స‌మాచారం. శుక్రవారం ఆ ఆరుగురు అస్సోంలోని గౌహ‌తిలో జరిగే ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్ సభలో పాల్గొన‌నున్నారు. వీరంతా గతేడాది కాంగ్రెస్‌ నుంచి వచ్చి టీఎంసీలో చేరారు. ఇప్పుడు బీజేపీలోకి వెళ్ల‌డానికి సిద్ధమవుతున్నారు.    

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments