Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రిపుల్ తలాఖ్ చెప్పిన భర్త.. చెంప ఛెల్లుమనిపించిన భార్య

Webdunia
ఆదివారం, 9 డిశెంబరు 2018 (16:15 IST)
ట్రిపుల్ తలాక్‌పై నిషేధం విధించినా.. భార్యను తెగతెంపులు చేసేందుకు ట్రిపుల్ తలాక్‌ను వాడేవారి సంఖ్య తగట్లేదు. తాజాగా భార్యతో గొడవ పడిన ఓ ఎన్నారై డాక్టర్.. ఆమెను ఎయిర్‌పోర్టులో వదిలి అమెరికాకు పారిపోయాడు. అక్కడితో ఆగకుండా వాట్సాప్‌లో మూడుసార్లు తలాక్ అంటూ పంపాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన రేష్మా అజీజ్‌కు 2003లో అదే ప్రాంతానికి చెందిన డాక్టర్ జావేద్‌ ఖాన్‌తో వివాహం జరిగింది. ఈ జంట అమెరికాకు వలస వెళ్లింది. ఈ జంటకు ప్రస్తుతం 13ఏళ్ల కుమార్తె, పదేళ్ల కుమారుడు వున్నారు. కానీ ఈ దంపతుల మధ్య పదే పదే గొడవలు జరిగేవి. దీంతో పెద్దల సమక్షంలో పరిష్కరించేందుకు ఇల్లినాయిస్ నుంచి బెంగళూరు వచ్చినా ఫలితం లేకపోయింది. 
 
ముందు జాగ్రత్తగా ఆమె పాస్ పోర్టు, వీసాలను తీసుకున్న జావేద్.. బెంగళూరులోనే ఆమెను దించేసి రిటర్న్ ఫ్లైట్ ఎక్కి అమెరికాకు చెక్కేశాడు. మూడుసార్లు వాట్సాప్‌లో తలాక్ చెప్పేశాడు. దీంతో షాకైన రేష్మా పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

మరోవైపు కోర్టులో ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్తను భార్య చెంప ఛెల్లుమనిపించింది. తనను కాదన్న భర్తను చెంప వాయించింది. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. ట్రిపుల్ తలాక్‌తో భార్యను తెగతెంపులు చేసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు ఆస్తులపై ఐటి దాడులు- వెంకటేష్ తో సినిమా ప్రచారం.. ఆంతర్యం?

Sai Pallavi :హైలెస్సో హైలెస్సా అంటూ ప్రేమలో జీవించిన నాగ చైతన్య, సాయి పల్లవి

మాలో ఉన్న అహంకారం రాలి పడింది : కోట శ్రీనివాస్ జ్ఞాపకాలు

డాకు మహారాజ్ నుంచి సుక్క నీరు లిరిక్ విడుదలచేశారు

సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ కు మరింత వినోదం వుండేలా డిజైన్ చేస్తా : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments