Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రయంబకేశ్వర్ ఆలయ గర్భగుడిలోకి మహిళాభక్తుల ప్రవేశం! 6-7 గంటల మధ్యలోనే?!

Webdunia
శనివారం, 16 ఏప్రియల్ 2016 (10:26 IST)
మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ ఆలయ గర్భగుడిలోకి మహిళాభక్తుల ప్రవేశంపై శతాబ్ధాలుగా నెలకొన్న ఆంక్షలు తొలగిపోయాయి. ద్వాదశ జోతిర్లింగాల్లో ఒకటైన ఈ ఆలయంలో మహిళల ప్రవేశానికి అనుమతినిస్తూ ఆలయ ట్రస్టు నిర్ణయం తీసుకుంది. అయితే కొన్ని నిబంధనలు విధించింది.

పురుష భక్తుల మాదిరిగానే ప్రతిరోజు ఓ గంటపాటు ఉదయం 6 నుంచి 7గంటల మధ్య గర్భగుడిలోకి అనుమతి ఉంటుందని, అలాగే తడి బట్టలు లేదంటే సిల్క్‌ వస్త్రా‌లు ధరించిన మహిళలనే అనుమతిస్తామని ట్రస్ట్‌ స్పష్టం చేసింది. 
 
కాగా ఈ నిబంధనను పుణెకు చెందిన స్వరాజ్‌ సంఘటన అధ్యక్షురాలు వనిత గుత్తే తీవ్రంగా వ్యతిరేకించారు. గర్భగుడిలోకి మహిళలను అనుమతించాలంటూ ఆందోళనలను నిర్వహిస్తున్న వనిత.. తన సభ్యులతో కలిసి గురువారం త్రయంబకేశ్వర్‌కు చేరుకున్నారు.

అయితే షరతులతో కూడిన ఆలయ ప్రవేశాన్ని ఆమె తిరస్కరించారు. ఆలయ నిర్వాహకులు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారంటూ ఫిర్యాదుచేశారు. దీంతో పోలీసులు ఆలయ నిర్వాహకులు సహా 250 మందిపై కేసు పెట్టారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments