Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్లవాడైన కృష్ణుడిని పూజిస్తాం.. దక్షిణ భారతీయులతో జీవిస్తున్నాం.. ఇంకెక్కడ వివక్ష?

భారతీయులను జాత్యహంకారులు అనడం దుర్మార్గమని.. భారత దేశంలో జాతివివక్ష లేదంటూ.. బీజేపీ మాజీ ఎంపీ తరుణ్ విజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే తాము నల్లవాడైన కృష్ణుడిని పూజిస్తామని.. మాకే తనుక జాతివివక్

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (16:33 IST)
భారతీయులను జాత్యహంకారులు అనడం దుర్మార్గమని.. భారత దేశంలో జాతివివక్ష లేదంటూ.. బీజేపీ మాజీ ఎంపీ తరుణ్ విజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే తాము నల్లవాడైన కృష్ణుడిని పూజిస్తామని.. మాకే తనుక జాతివివక్ష ఉంటే దక్షిణ భారతీయులతో కలిసి ఎలా నివసిస్తామని ప్రశ్నించారు. ఇలా దక్షిణ భారతీయులపై జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం విమర్శలకు దారితీశాయి. 
 
కాగా ఇద్దరు నైజీరియా విద్యార్థులపై నోయిడాలో జరిగిన దాడిపై 'ఆల్ జజీరా' చానల్ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ.. దక్షిణ భారతీయులతో తాము కలిసి జీవిస్తున్నామని.. అలాంటప్పుడు భారత్‌లో జాత్యంహకారులు ఎక్కడు ఉన్నారని ప్రశ్నించారు. 
 
తమలోనూ, తమ చుట్టూ నల్లజాతీయులు ఉన్నారనే విషయాన్ని గుర్తు చేశారు. వివిధ వర్గాల వారున్నప్పటికీ.. దేశంలో జాత్యహంకారం లేదన్నారు. అయితే తరుణ్ విజయ్ వ్యాఖ్యలు వివాదాస్పదమైనాయి. భారత దేశమంతా కేవలం ఉత్తరాది ఒకటేనని ఆయన భావిస్తున్నారని.. దక్షిణాది వారిని నల్లజాతీయులనడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

Yamudu: ఆసక్తి కలిగేలా జగదీష్ ఆమంచి నటించిన యముడు కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments