Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ ప్రోటోకాల్ బ్రేక్ : కమల్ హాసన్‌కు చిక్కులు

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (15:28 IST)
విశ్వనటుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ చిక్కుల్లోపడ్డారు. కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసినందుకుగాను ఆయనకు తమిళనాడు ఆరోగ్య శాఖ నోటీసులు జారీచేయనుంది. కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసినందుకు ఇవ్వరణ కోరనుంది.
 
ఇటీవల అమెరికాకు వెళ్లివచ్చిన కమల్ హాసన్ కోవిడ్ బారినపడ్డారు. దీంతో ఆయన చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. నవంబరు 22వ తేదీన ఆస్పత్రిలో చేరిన ఆయన ఈ నెల 4వ తేదీన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 
 
అయితే, కరోనా వైరస్ నుంచి కోలుకున్న తర్వాత ఒక వ్యక్తి హోం క్వారంటైన్‌లో మరో వారం రోజుల పాటు ఉండాల్సివుంది. కానీ, కమల్ హాసన్ ఆ విధంగా చేయలేదు. ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే నేరుగా తాను హోస్ట్‌గా నిర్వహించే బిగ్ బాస్ సీజన్ 5 తమిళ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఇదే ఇపుడు చిక్కులు తెచ్చిపెట్టింది. 
 
దీనిపై తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ జె.రాధాకృష్ణన్ స్పందించారు. కోవిడ్ ప్రోటోకాల్ బ్రేక్ చేసినందుకు కమల్ హాసన్ నుంచి వివరణ కోరుతామని, ఇదే అంశంపై ఆయనకు నోటీసు పంపించనున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments