Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడుకు జల్లికట్టు కళ వచ్చేసింది.. అలంగానల్లూరులో పండగే పండగ.. జల్లికట్టుకు సెహ్వాగ్

జల్లికట్టుపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హింసకు తావు లేకుండా తమిళులు భారీగా జరుపుతున్న నిరసనకు టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మద్దతు పలికాడు. తన స్పందనను ట్వ

Webdunia
శనివారం, 21 జనవరి 2017 (18:13 IST)
జల్లికట్టుపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హింసకు తావు లేకుండా తమిళులు భారీగా జరుపుతున్న నిరసనకు టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మద్దతు పలికాడు. తన స్పందనను ట్విట్టర్‌లో తమిళ భాషలోనే తెలియజేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇంతకీ ఏమన్నాడంటే.. ‘అద్భుతమైన తమిళ ప్రజలకు తన గౌరవ వందనాలని చెప్పాడు. ఇలాగే శాంతియుతమైన నిరసనలనే కొనసాగించండని పేర్కొంటూ.. ప్రేమతో ట్వీట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్. దీంతో తమిళ ప్రజలు ఈ ట్వీట్‌ను విపరీతంగా షేర్ చేస్తున్నారు. తమిళులు ఎంతో ఆనందించాల్సిన ట్వీట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
  
తమిళుల సంప్రదాయంలో భాగమైన జల్లికట్టుపై దేశ అత్యున్నత న్యాయస్థానం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వన్ జల్లికట్టుపై ఆర్డినెన్స్ తేవాలని ప్రధాని మోడీకి లెటర్ కూడా రాసారు. సినిమా సెలబ్రిటీలందరూ ఒక్కతాటిపైకి వచ్చి మద్దతునిచ్చారు. తమిళ ప్రజలు, ప్రముఖులు మెరీనా బీచ్ తీరంలో భారీగా చేరుకుని హింసకు తావులేకుండా పెద్ద ఎత్తున నిరశనలు తెలిపారు. దీంతో కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌కు అంగీకరించిన సంగతి తెలిసిందే.  
 
ఇదిలా ఉంటే... తమిళుల సంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టుపై తమిళనాడు ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ విద్యాసాగర్‌రావు ఆమోదం తెలిపారు. దీంతో రేపు(ఆదివారం) మధురై జిల్లా అలంగానల్లూరులో ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అధికారికంగా జల్లికట్టు క్రీడను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రాల్లో మంత్రులు ఈ వేడుకలను ప్రారంభిస్తారు. ఈ ఆర్డినెన్స్ స్థానంలో ఈనెల 23న జరిగే తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో జల్లికట్టుపై బిల్లును ప్రవేశపెట్టి ఆమోదిస్తారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

కొన్ని రోజులు థియేటర్స్ లో వర్క్ చేశా, అక్కడే బీజం పడింది : హీరో ధర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments