జయ మృతి కేసు : ఆ నలుగురి వద్ద విచారించండి .. రిటైర్డ్ జస్టిస్ ఆర్ముగస్వామి

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2022 (08:20 IST)
మాజీ మఖ్యమంత్రి, అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి దివగంత జయలలిత మృతి కేసులో ఆ నలుగురి వద్ద విచారించాలని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మాజీ న్యాయమూర్తి ఆర్ముగస్వామి కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ అంశం ఇపుడు తమిళనాట చర్చనీయాంశంగా మారింది. 
 
ఇంతకీ ఈ నలుగురు ఎవరో కాదు.. జయలలిత స్నేహితురాలు శశికళ, ఆరోగ్య శాఖ మాజీ మంత్రి విజయభాస్కర్, తమిళనాడు ప్రభుత్వం మాజీ ప్రధాన కార్యదర్శి పి.రామ్మోహన్ రావు, జయలలిత వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ శివకుమార్‌లు. ఈ నలుగురు వద్ద విచారణకు ఆదేశించాలని కమిషన్ సిఫార్సు చేసింది. 
 
అయితే, ఈ వ్యవహారంలో న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి స్టాలిన్ సారథ్యంలోని తమిళనాడు మంత్రిమండలి సోమవారం సమావేశమైన తీర్మానించింది. 
 
అలాగే, తూత్తుక్కుడి కాల్పులకు సంబంధించి 17 మంది పోలీస్ ఉన్నతాధికారులు, నాటి జిల్లా కలెక్టర్‌ సహా నలుగురు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటూ జస్టిస్ అరుణా జగదీశన్ కమిటీ సిఫార్సు చేసింది. దీనిపై కూడా చర్చించిన కేబినెట్... ఆ మేరకు చర్యలకు సంబంధించి ఆయా శాఖకు ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments