Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశాన్ని వణికిస్తోన్న కరోనా.. బెంగాల్ ఎమ్మెల్యే మృతి

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (12:47 IST)
దేశాన్ని కరోనా వైరస్ వణికిస్తూనే వుంది. తాజాగా దేశంలో రికార్డు స్థాయికి చేరాయి.  గడచిన 24 గంటల్లో 15,968 కరోనా కేసులు నమోదు కాగా, 465 మరణాలు సంభవించాయి. దేశంలో కరోనా కేసుల వెల్లువకు తెరపడట్లేదు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 4,56,183కి చేరింది.

వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 1,83,022 మంది చికిత్స పొందుతుండగా.. 2,58,685 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు కేంద్రం తెలిపింది. కరోనాతో ఇప్పటి వరకు 14,476 మంది ప్రాణాలు విడిచారు. 
 
కరోనా వైరస్ కారణంగా పశ్చిమబెంగాల్ లో ఓ ఎమ్మెల్యే మరణించారు. అంతకుముందే తమిళనాడులోనూ ఎమ్మెల్యే బలయ్యారు. జూన్ 23 వరకూ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 73 లక్షల 52 వేల 911 కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. పశ్చిమబెంగాల్లో తమోనష్ ఘోష్ కరోనా వైరస్ కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మూడుపార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. టీఎంసీ ఎమ్మెల్యే మృతికి సీఎంమమతా బెనర్జీ, పార్టీనేతలు సంతాపం తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments