Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘అతిపెద్ద అల్లర్ల సృష్టికర్త’ మోడీ : మరో ట్రంప్ అవుతారు.. మమతా హెచ్చరిక

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (08:55 IST)
ప్రధాని నరేంద్ర మోడీకి టీఎంసీ అధినేత్రి, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గట్టి హెచ్చరిక చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత డోనాల్డ్ ట్రంప్‌కు ఎదురైన పరాభవమే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రధాని మోడీకి ఎదురవుతుందని ఆమె జోస్యం చెప్పారు. 
 
గతవారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించిన హుగ్లీ జిల్లా సహగంజ్‌లో బుధవాకం మమత బహిరంగ సభ నిర్వహించారు. ఈ  సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాని మోడీపై నిప్పులు చెరిగారు. ‘అతిపెద్ద అల్లర్ల సృష్టికర్త’గా మోడీని అభివర్ణించారు. 
 
అమిత్ షా, మోడీ ఇద్దరూ కలిసి అసత్యాలను ప్రచారం చేస్తూ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. మోడీ అవకాశవాది అని, అల్లర్ల సృష్టికర్త అని ఆరోపించిన మమత.. కోట్ల రూపాయలకు దేశాన్ని అమ్ముకుంటున్నారని ఆరోపించారు.
 
టీఎంసీ కమీషన్లు (కట్ మనీ) తీసుకుంటుందని ఆరోపిస్తున్న బీజేపీ నేతలు మరి దీనినేమంటారని ప్రశ్నించారు. క్యాట్ మనీ అంటారా? లేక, ర్యాట్ మనీ అంటారా? అని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో టీఎంసీ విజయం సాధించి మరోమారు అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments