Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య కాపురానికి రాలేదని.. ఫూటుగా తాగి కత్తితో దాడి.. అత్తమామలతో పాటు కుమార్తెలకు గాయాలు!

మద్యం మత్తులో ఓ కూలి కార్మికుడు భార్య కాపురానికి రాలేదని.. ఆమె పుట్టింటికి వెళ్ళి కత్తితో దాడి జరిపి బీభత్సం సృష్టించాడు. ఈ ఘటన తిరునల్వేలిలో చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో ఆ భర్త తరచూ వేధించేవాడు.

Webdunia
గురువారం, 7 జులై 2016 (11:35 IST)
మద్యం మత్తులో ఓ కూలి కార్మికుడు భార్య కాపురానికి రాలేదని.. ఆమె పుట్టింటికి వెళ్ళి కత్తితో దాడి జరిపి బీభత్సం సృష్టించాడు. ఈ ఘటన తిరునల్వేలిలో చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో ఆ భర్త తరచూ వేధించేవాడు. భర్త వేధింపులు తాళలేక అతని భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది.

ఇక ఒంటరితనాన్ని భరించలేక భార్య వద్దకు వెళ్లిన ఆ భర్త ఫూటుగా తప్ప తాగాడు. తన భార్యను తనతో పంపాల్సిందిగా నానా హంగామా చేశాడు. చివరికి అత్తగారింట ఎవ్వరూ తమ బిడ్డను పంపలేమంటూ చెప్పేయడంతో కత్తితో రభస చేశాడు. భార్యాపిల్లలు, అత్తమామలపై కత్తితో దాడి చేశాడు.
 
వివరాల్లోకి వెళితే.. తిరునల్వేలి జిల్లా అంబై ప్రాంతానికి చెందిన బ్రమ్మకుట్టి (25), రాజం (23) దంపతులు ఐదేళ్లకు ముందు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇస్యా (4), నాదస్వరి (2) ఇద్దరు కుమార్తెలున్నారు. బ్రమ్మకుట్టి రోజూ రాత్రిపూట తాగి ఇంటికొచ్చి భార్యతో గొడవ పడుతుండేవాడు.

ఇటీవల భార్య రాజంపై అనుమానం పెంచుకున్నాడు. భర్త ఆగడాలను భరించలేక ఆరుమాసాలకు ముందు రాజం, పిల్లలను వెంట బెట్టుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. బ్రమ్మకుట్టి ఇక తన భార్యను తనతో పంపాలని అత్తగారింటికెళ్లి గొడవపడ్డాడు. రాజం అతడితో కాపురం చేసేది లేదని తేల్చి చెప్పేసింది. 
 
దీంతో పీకలదాకా తాగిన బ్రమ్మకుట్టి వేటకొడవలితో భార్యపై దాడి జరిపాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిత అత్త మామలను కత్తితో పొడిచాడు. తన ఇద్దరు కుమార్తెలపైనా కత్తితో దాడి జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని బ్రమ్మకుట్టి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వరాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన జోకర్... : ప్రకాష్ రాజ్‌పై నిర్మాత వినోద్ కుమార్ ఫైర్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments