Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య అతి పరిశుభ్రత... భరించలేక చంపేసిన భర్త

Webdunia
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (11:48 IST)
భార్య అతి పరిశుభ్రతను భరించలేని ఓ భర్త.. ఆమెను హత్య చేసిన టన కర్నాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలో వెలుగు చూసిది. ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళారం చోటుచేసుకోగా, ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మైసూర్‌ జిల్లాలోని మండహళ్లికి చెందిన శాంతమూర్తి (40), పుట్టమణి (38) అనే దంపతులు ఉన్నారు. వీరికి 15 యేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 
 
అయితే పెళ్లి అయినప్పటి నుంచి పుట్టమణి శుచి, శుభ్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఆమెకు కులమతాలపై విశ్వాసం ఎక్కువ ఉండడంతో.. తూచా తప్పకుండా పద్దతులు పాటించేది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లి.. మళ్లీ తిరిగి ఇంటికొచ్చిన తర్వాత తప్పకుండా ప్రతి ఒక్కరూ స్నానం చేయాలి. 
 
ఇలా రోజుకు భర్తతో పాటు పిల్లలు కనీసం పదిసార్లు అయినా స్నానం చేయాల్సి వచ్చేది. అంతేకాదు పిల్లల స్కూల్‌ బ్యాగులకు కూడా ఆమె సాయంత్రం వేళ ప్రోక్షణ చేసేది. ఇక తన భర్త తెచ్చే కరెన్సీ నోట్లను కూడా కడిగి ఆరబెట్టేది. దీంతో ఈ మధ్య కాలంలో పుట్టమణి విశ్వాసాలు శ్రుతి మించడంతో.. భర్త విసుగు చెందాడు. 
 
మంగళవారం పొలం వద్దకు తీసుకెళ్లి కొడవలితో ఆమెను నరికి చంపాడు. ఆ తర్వాత తాను ఇంటికొచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం పుట్టమణి, శాంతమూర్తికి మధ్య గొడవ జరిగింది. ధాన్యం అమ్ముకొచ్చి వచ్చిన డబ్బులను భార్యకు ఇచ్చాడు. 
 
అయితే ఆ డబ్బులను ఆమె కడిగి ఆరబెట్టింది. ఈ క్రమంలో ఇరువురి మధ్య గొడవ మొదలైంది అని ప్రభు పేర్కొన్నాడు. దీంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన శాంతమూర్తి ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని శాంతమూర్తి స్నేహితుడు చెప్పాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments