Webdunia - Bharat's app for daily news and videos

Install App

50 కిలోమీటర్లు.. పది గంటలు.. తల్లి మృతదేహంతో జవాను నడక..

దేశరక్షణ కోసం పాటుపడే ఓ వీర జవానుకు చేదు అనుభవం మిగిలింది. పఠాన్ కోట్‌లో జవానుగా పనిచేస్తున్న మహ్మద్ అబ్బాస్ తల్లి నాలుగు రోజుల క్రితం మరణించింది. మాతృమూర్తికి సొంతూరైన కర్మాలోనే అంత్యక్రియలు నిర్వర్త

Webdunia
శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (09:14 IST)
దేశరక్షణ కోసం పాటుపడే ఓ వీర జవానుకు చేదు అనుభవం మిగిలింది. పఠాన్ కోట్‌లో జవానుగా పనిచేస్తున్న మహ్మద్ అబ్బాస్ తల్లి నాలుగు రోజుల క్రితం మరణించింది. మాతృమూర్తికి సొంతూరైన కర్మాలోనే అంత్యక్రియలు నిర్వర్తించాలనేది అబ్బాస్‌ కోరిక. కానీ అక్కడ అంత్యక్రియలు నిర్వహించాలంటే.. 50 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఏదైనా వాహనంలో వెళ్దామనుకుంటే వాతావరణం సహకరించదు. రోడ్డుపై ఆరు అడుగుల మేర మంచు పేరుకుపోయింది. 
 
ఇక చేసేది లేక మృతదేహాన్ని తరలించేందుకు హెలికాప్టర్ సిద్ధం చేస్తామని కుప్వారా జిల్లా అధికారులు మాటిచ్చారు. నాలుగు రోజులైనా దాని జాడ లేకపోవడంతో తల్లి మృతదేహాన్ని భుజానేసుకొని సొంతూరుకు బయలు దేరాడు. పదిగంటలు నడిచి అక్కడికి చేరుకున్నాడు.
 
అధికారుల తీరుతో తన తల్లికి సరైన రీతిలో అంత్యక్రియలు నిర్వహించలేకపోయానని అబ్బాస్‌ విలపించాడు. అయితే.. హెలికాప్టర్‌ను సిద్ధం చేశామని, వాతావరణం సరిగా లేకపోవడంతో సాయం పొందేందుకు అబ్బాస్‌ కుటుంబ సభ్యులు తిరస్కరించారని అంటున్నారు. కానీ వాదనను అబ్బాస్ కొట్టిపారేశాడు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments