Webdunia - Bharat's app for daily news and videos

Install App

గిన్నిస్ రికార్డు సృష్టించనున్న యూపీ ఆర్టీసీ

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (13:09 IST)
బస్సులతో గిన్నీస్ రికార్డ్‌కు ప్రయత్నిస్తోంది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. జనవరి 15న మకర సంక్రాంతితో ప్రారంభమైన మహా కుంభమేళాను విజయవంతంగా నిర్వహిస్తున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీని ముగింపును మాత్రం మరింత ఆకట్టుకునే రీతిలో ఉండేలా ప్లాన్ చేసింది. 
 
పవిత్ర గంగానది వెంట దాదాపు 8 కిలోమీటర్ల పొడవునా 40 స్నాన ఘట్టాల్ని నిర్మించారు. భద్రత కోసం దాదాపు 20 వేల మంది సైనికులను వినియోగిస్తున్నారు. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలతో భక్తులు స్నానాలు ఆచరించే 100 మీటర్ల పరిధిలో ఫోటోలు మరియు వీడియోలను చిత్రీకరించడాన్ని అధికారులు నిషేధించారు. పైగా, ఈ కుంభమేళాకు భారీ స్పందన వచ్చింది. ప్రపంచం నలుమూలల నుండి భక్తులు తరలివస్తున్నారు. 
 
మార్చి 4వ తేదీన మహాశివరాత్రితో మహాకుంభమేళా ముగియనున్న నేపథ్యంలో దాదాపు 500 బస్సులతో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గిన్నీస్ బుక్ రికార్డ్ కోసం ప్రయత్నం చెయ్యబోతోంది. ఆ బస్సుల మీద కుంభమేళా లోగోను కూడా ఏర్పాటు చేసింది. బస్సులన్నీ వరుస క్రమంలో ఒకదాని వెనుక ఒకటి వెళ్లబోతున్నాయి. ఈ బస్సుల వరుస ఏకంగా 3.2 కిలోమీటర్ల దూరం ఉండబోతోంది. ప్రపంచంలో ఇంత పెద్ద బస్సుల వరుస ఇప్పటివరకూ లేదు. అందువల్ల ఇది గిన్నీస్ బుక్ రికార్డు సృష్టిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments