Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఔరంగాబాద్‌లో విషం తాగిన ఆరుగురు యువకులు

Webdunia
ఆదివారం, 10 ఏప్రియల్ 2022 (09:25 IST)
బిహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్‌లో ఆరుగురు యువతులు విషం సేవించారు. వీరిలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. మిగిలినవారి పరిస్థితి విషమంగా ఉంది. ఓ యువకుడు ప్రేమించిన యువతిని పెళ్లి చేసేకునేందుకు నిరాకరించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆ యువతి విషం సేవించింది. దీన్ని చూసిన మరో ఐదుగురు యువతులు కూడా విషం సేవించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, బిహార్‌ రాష్ట్రంలోని ఔరంగాబాద్, కాస్మా ప్రాంతానికి చెందిన ఆరుగురు యువతులు బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్నారు. వీరిలో ఓ బాలిక యువకుడితో ప్రేమలోపడింది. అయితే ఆ యువతిని పెళ్లి చేసుకునేందుకు యువకుడు నిరాకరించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆ యువతి బలవాన్మరణానికి పాల్పడేందుకు విషం సేవించింది. అది చూసిన మిగతా ఐదుగురు యువతలు కూడా విషం తీసుకుని ఆత్మహత్యకు యత్నించారు. 
 
ఈ ఘటనలో ముగ్గురు బాలికలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో మగధ్ వైద్య కాలేజీ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
బాలికలందరూ వేర్వేరు కుటుంబాలకు చెందినవారని వారి వయసు 12 నుంచి 16 యేళ్ల మధ్య ఉంటుందని చెప్పారు. మిగిలిన ఐదుగురు అమ్మాయిలు ఎందుకు విషం సేవించారన్న అంశంపై విచారణ జరుపుతున్నట్టు ఔరంగాబాద్ ఎస్పీ కాంతేశ్ కుమార్ మిశ్రా వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments