Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో ర్యాగింగ్ భూతం.. బాలుర ప్రైవేట్ పార్ట్స్‌ను మాంజా దారంతో కట్టేసి?

మహారాష్ట్రలో ర్యాగింగ్ భూతం జడలు విప్పింది. మహారాష్ట్రలోని పర్బానీ జిల్లాలో వున్న ఓ స్కూలులో దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తొమ్మిది, పదేళ్లున్న ఇద్దరు విద్యార్థులను 10, 13 సంవత్సరాల వయసున

Webdunia
సోమవారం, 17 సెప్టెంబరు 2018 (10:51 IST)
మహారాష్ట్రలో ర్యాగింగ్ భూతం జడలు విప్పింది. మహారాష్ట్రలోని పర్బానీ జిల్లాలో వున్న ఓ స్కూలులో దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తొమ్మిది, పదేళ్లున్న ఇద్దరు విద్యార్థులను 10, 13 సంవత్సరాల వయసున్న ఇద్దరు విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో వేధించారు.


బాలురను కొట్టి, వారి రహస్య భాగాలను గాలిపటాలు ఎగరవేసే దారం (మాంజా)తో కట్టి హింసించారు. ఈ ఘటనపై సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజయ్ పర్‌దేశీ స్పందిస్తూ.. ఈ కేసులో వేదిక్ స్కూలు డైరెక్టర్ కులకర్ణిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.
 
ఆగస్టు 26-సెప్టెంబరు 12 మధ్య ఈ ఘటన జరిగిందని సంజయ్ చెప్పుకొచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ బాగోతం బయటపడింది. ర్యాగింగ్‌పై బాధిత విద్యార్థులు 42 ఏళ్ల స్కూలు డైరెక్టర్ కులకర్ణికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో వారు తల్లిదండ్రులకు విషయం చెప్పారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కులకర్ణిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులైన 10, 13 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలురను కూడా అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. 
 
వేదిక్ పాఠశాలను అక్రమంగా నడుపుతున్నారని, కేవలం ఆరుగురు విద్యార్థులు మాత్రమే చదువుకుంటున్నారని తెలిపారు. రిజిస్టర్‌లో ఆ విషయాన్ని కూడా నమోదు చేయలేదని తెలిపారు. కాగా, కులకర్ణిని కోర్టులో ప్రవేశపెట్టగా జుడీషియల్ రిమాండ్‌కు పంపింది. నిందితులైన ఇద్దరు బాలురను జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట ప్రవేశపెట్టామని, అనంతరం వారిని రిమాండ్ హోమ్‌కు తరలించినట్టు ఎస్పీ పరదేశ్ చెప్పారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments