Webdunia - Bharat's app for daily news and videos

Install App

గిన్నిస్ బుక్‌లో 86 ఏళ్ల కేరళ వృద్ధ గజరాజు: తైవాన్ ఏనుగు 85 ఏళ్లలో చనిపోగా?

కేరళకు చెందిన 86 సంవత్సరాల ఏనుగు దాక్షాయణి పేరు గిన్నిస్‌ బుక్‌లో చోటుచేసుకునే అవకాశాలున్నాయి. 86 ఏళ్ల వయస్సులోనూ ఎలాంటి వృద్ధాప్య ఛాయలు లేకుండా ఈ ఏనుగు జీవనాన్ని గడుపుతోంది. ఏనుగు యజమానులైన ట్రావెన్‌

Webdunia
బుధవారం, 27 జులై 2016 (18:22 IST)
కేరళకు చెందిన 86 సంవత్సరాల ఏనుగు దాక్షాయణి పేరు గిన్నిస్‌ బుక్‌లో చోటుచేసుకునే అవకాశాలున్నాయి. 86 ఏళ్ల వయస్సులోనూ ఎలాంటి వృద్ధాప్య ఛాయలు లేకుండా ఈ ఏనుగు జీవనాన్ని గడుపుతోంది. ఏనుగు యజమానులైన ట్రావెన్‌కోర్‌ దేవసోమ్‌ బోర్డ్‌ గిన్నిస్‌ అధికారులకు ఏనుగు గురించి లేఖ రాశారు. ప్రపంచంలోనే జీవించి ఉన్న అత్యంత వృద్ధ ఏనుగుగా దాక్షాయణి గురించి లేఖలో పేర్కొన్నారు. 
 
కేర‌ళ‌కు చెందిన ట్రావ‌న్‌కోర్ దేవ‌స్థాన బోర్డు ద‌గ్గ‌ర ఈ ఏనుగు ఉంది. ఇక‌ ప్రాణాల‌తో జీవిస్తున్న ఏనుగుల్లో దాక్షాయ‌ణి ప్ర‌పంచంలోనే అత్యంత వృధ్ధ ఏనుగు అని ట్రావ‌న్‌కోర్ బోర్డు అధ్య‌క్షుడు ప్ర‌య‌ర్ గోపాల‌కృష్ణ‌న్ తెలిపారు. కేర‌ళ అట‌వీశాఖ రికార్డులు కూడా ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నట్లు వెల్లడించారు. 
 
వృద్ధ ఏనుగుగా గుర్తింపు పొందిన దాక్షాయ‌ణిని ట్రావ‌న్‌కోర్ బోర్డు స‌త్క‌రించింది. ఈ సంద‌ర్భంగా కేర‌ళ పోస్ట‌ల్ స‌ర్వీస్ కూడా దాక్ష‌య‌ణి పేరిట ప్ర‌త్యేక పోస్ట‌ల్ క‌వ‌ర్‌ను రిలీజ్ చేయ‌నున్నారు. గతంలో తైవాన్‌కు చెందిన ఓ ఏనుగు 85 ఏళ్ల జీవించింది. అది 2003లో చ‌నిపోయింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments