Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెడిసిన్ చదవడానికి డబ్బుల్లేవ్.. కన్యాత్వాన్ని వేలానికి పెట్టేసింది..

మెడిసిన్ చదవడానికి డబ్బుల్లేక ఒక అమ్మాయి తన కన్యత్వాన్ని వేలానికి పెట్టిన సంఘటన రష్యాలో చోటుచేసుకుంది. ఆ వివరాలను పరిశీలిస్తే.. రష్యాలో అరియానా అనే అమ్మాయి విదేశాల్లో మెడిసిన్ చదవాలని ఆశపడింది. అందుకు

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2016 (10:12 IST)
మెడిసిన్ చదవడానికి డబ్బుల్లేక ఒక అమ్మాయి తన కన్యత్వాన్ని వేలానికి పెట్టిన సంఘటన రష్యాలో చోటుచేసుకుంది. ఆ వివరాలను పరిశీలిస్తే.. రష్యాలో అరియానా అనే అమ్మాయి విదేశాల్లో మెడిసిన్ చదవాలని ఆశపడింది. అందుకు చాలా డబ్బు ఖర్చవుతుంది. అందుకోసం ఆమె ఆన్‌లైన్‌లో తన కన్యత్వాన్ని వేలానికి పెట్టింది. ప్రారంభ బిడ్‌ను 1,30,500 పౌండ్లను కోట్ చేసింది. తనలాగే ఎందరో ఇటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా అరియానా పేర్కొంది.
 
మెడిసిన్ చదివేందుకు విదేశాలు వెళ్లాలనుకుంటున్నానని, కానీ అక్కడి యూనివర్సిటీ చాలా ఖరీదైనదని... అద్దె మొదలు అన్నీ ఎక్కువేనని వాపోయింది. ఇతర దేశాలకు వెళ్లడమంటే చాలా కష్టంతో కూడుకున్న పనని తాను ఉన్న పరిస్థితిలో అక్కడ ఉండి చదువుకోవడం మరింత కష్టమని చెప్పింది. అందుకే ఎలాగైనా చదువు కోసం డబ్బులు సంపాదించాలని తన కన్యత్వాన్ని ఆన్‌లైన్‌లో వేలానికి పెట్టానని చెప్పింది.ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఆమె తన కన్యత్వాన్ని వేలానికి పెట్టిన విషయం తల్లిదండ్రులకు తెలియదు.
 
అయితే ఎవరికోసమో ఎదురుచూసి వారికి నా కన్యత్వాన్ని అప్పగించిన తర్వాత అతడు నా హృదయాన్ని ముక్కలు చేసి వెళ్లిపోతాడని, అటువంటి వారి కోసం ఎదురుచూసి మరీ కన్యత్వాన్ని ఎందుకు అప్పగించాలని, దానిని నా చదువుకోసం వినియోగిస్తానని తెలివిగా చెప్పింది ఆ అమ్మాయి. ఐతే తనలాగే తన స్నేహితురాలు కూడా ఇలాగే కన్యత్వాన్ని వేలానికి పెట్టిందని చెప్పింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెట్‌ఫ్లిక్స్ సంస్థపై ధనుష్ కేసు.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్

వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం