Webdunia - Bharat's app for daily news and videos

Install App

పత్రాలు చోరీ చేసి ఇచ్చేటందుకు నెలకు రూ. 2 లక్షల జీతం

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (08:50 IST)
వారు చేసేందంతా కొన్ని పత్రాలను జిరాక్సు తీసి లేదా ప్రింటు తీసి కొన్ని సంస్థలకు అందజేయడమే. అదీ రోజు ఏమి కాదు. మూడ నెలలకో.. నాలుగు నెలలకో ఒక్కమారు. కానీ వారు నెల నెల అందుకునే జీతం ఎంతో తెలుసా.. అక్షరాలా రూ. 2 లక్షలు ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ నిజం. మరీ వారు అందించే పత్రాలు ఏమైనా సామాన్యమైనవా.. ప్రభుత్వ నిర్ణయాలు అందుకే అంత ఖరీదైన జీతం. వివరాలిలా ఉన్నాయి. 
 
కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖలో పత్రాలను లీక్ చేసిన వారికి కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్ భారీ మొత్తాన్ని నెలవారీ వేతనం కింద చెల్లించేవారు. డాక్యుమెంట్ల లీకు కేసులో చార్జిషీట్‌ను సోమవారం ఇక్కడి ఒక కోర్టుకు సమర్పించడంతో అసలు విషయాలు తేటతెల్లం అయ్యాయి. లల్తా ప్రసాద్, రాకేష్ కుమార్ అనే నిందితులు నెలవారీ మొత్తం రూ. 2.5 లక్షలు తీసుకునేవారి చార్జిషీట్‌లో  నమోదయ్యింది. 
 
ఆ మొత్తాన్ని ఆర్‌ఐఎల్‌కు చెందిన శైలేశ్ సక్సేనా, ఎస్సార్‌కు చెందిన వినయ్ కుమార్, కెయిర్న్స్ ఇండియా నుంచి కేకే నాయక్, జుబిలంట్ ఎనర్జీ నుంచి సుభాష్ చంద్ర, అడాగ్‌కు చెందిన రిషి ఆనంద్‌తో పాటు ఎనర్జీ కన్సల్టెంట్ ప్రయాస్ జైన్, జర్నలిస్ట్ శంతను సైకియా చెల్లించేవారని పేర్కొన్నారు.
 
తమ వ్యాపార లావాదేవీల కోసం నిందితులకు నెలవారీగా చెల్లింపులు చేసేవారమని ఆయా కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు పోలీసుల విచారణలో అంగీకరించారు. ఈ కేసుకు సంబంధించి 13 మంది నిందితులపై ఢిల్లీ పోలీసులు సమర్పించిన చార్జిషీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments