Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదేళ్ళ బాలుడిని మింగేసిన మొసలి.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 13 జులై 2022 (07:38 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షీపుర్‌లో ప్రతి ఒక్కరూ విస్తుపోయే, ఆశ్చర్యకర సంఘటన జరిగింది. ఓ పదేళ్ళ బాలుడిని మొసలి ఒకటి అమాంతం మింగేసింది. బాలుడు నదిలో స్నానం చేసుండగా, చడీచప్పుడు లేకుండా వచ్చిన మొసలి అతడిపై దాడి చేసి నీటిలోకి లాక్కెళ్లి, ఆ తర్వాత మింగేసింది. మొసలి దాడిచేసే సమయంలో అక్కడ ఉన్న ప్రజలు ఆ మొసలిని కర్రలతో కొట్టి, వలల సాయంతో పట్టుకుని ఒడ్డుకు చేర్చారు. అయితే, మొసలి మాత్రం బాలుడుని మింగేసింది. 
 
ఈ సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ అధికారులు అక్కడికి చేరుకుని, మొసలిని తిరిగి నీటిలోకి వదిలివేయాలని కోరారు. కానీ, గ్రామస్థులు ససేమిరా అన్నారు. దాని కడుపులో తమ బిడ్డ బతికే ఉండొచ్చని, ఉమ్మివేసేంతవరకూ వదిలేది లేదని కుటుంబీకులు తేల్చిచెప్పారు. మొసలి మింగేస్తే చనిపోయి ఉంటాడని, బతికిఉండే అవకాశం లేదని పోలీసులు, అటవీ అధికారులు నచ్చజెప్పడంతో ఎట్టకేలకు సాయంత్రం నాటికి ఆ మొసలిని విడిచిపెట్టారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments