Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరత్ ఎవరు..? అక్కను కూడా ఫాలో చేస్తున్నారని ఎలా అలెర్ట్ చేశాడు..?

ఐటీ రాజధాని నగరం బెంగళూరులో ఆదాయపు పన్ను శాఖాధికారి కుమారుడిని కిడ్నాప్‌ చేసి హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. తాజాగా విచారణలో భాగంగా తండ్రికి కిడ్నాపర్లు పంప

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2017 (15:01 IST)
ఐటీ రాజధాని నగరం బెంగళూరులో ఆదాయపు పన్ను శాఖాధికారి కుమారుడిని కిడ్నాప్‌ చేసి హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. తాజాగా విచారణలో భాగంగా తండ్రికి కిడ్నాపర్లు పంపిన వాట్సాప్ వీడియో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఐటీ శాఖాధికారిగా పనిచేస్తున్న నిరంజన్ తన కుమారుడైన శరత్.. తన కొత్త బైకును స్నేహితులకు చూపించేందుకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో నిరంజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
కానీ శరత్ మృతదేహాన్ని శుక్రవారం ఉదయం ఓ సరస్సులో  పోలీసులు కనుగొన్నారు. ఈ క్రమంలో కిడ్నాపర్ల  నుంచి వీడియాలు కూడా అందాయి. కిడ్నాప్ చేసిన రోజే శరత్‌ను హతమార్చారని.. ఈ కేసులో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. శరత్ కిడ్నాప్ వెనుక నిరంజన్ స్నేహితుడి హస్తం వున్నట్లు సమాచారం. 
 
ఇకపోతే.. పోలీసులకు పంపిన వీడియోలో కిడ్నాప్, హత్యకు గురైన శరత్ తల్లిదండ్రులకు హెచ్చరించాడు. సెప్టెంబర్ 12న విద్యార్థి శరత్‌ను ఎత్తుకెళ్లిన దుండగులు అతని సెల్ ఫోన్ లోనే వీడియో తీయించి పంపారు. హలో నాన్నా నేను కిడ్నాప్ అయ్యానని శరత్ చెప్పాడు. ఆ వీడియోలో కిడ్నాపర్లు రూ. 50లక్షలు డిమాండ్ చేస్తున్నారని.. అడిగింది ఇచ్చేయమని ప్రాధేయపడ్డాడు. మరో వీడియో తల్లిదండ్రులను అలెర్ట్ చేశాడు. 
 
కిడ్నాపర్లు అక్కను కూడా టార్గెట్ చేశారని.. రోజూ అక్క ఏం చేస్తుందో.. ఎక్కడికి వెళ్తుందో అన్నీ వారికి తెలుసునని చెప్పాడు. ఈ వీడియోను దుండగులు రికార్డు చేస్తున్న సమయంలో పక్కకు తిరిగిన శరత్, తాను సరిగ్గా చెప్పానా? అని అడిగాడు. ఈ వీడియోలు స్థానికంగా కలకలం రేపుతోంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments