Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ కేంద్ర మాజీ మంత్రి ఇంట్లో దొంగలు పడ్డారు... ఆరు విగ్రహాలను చోరీ చేశారట

కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ఇంట్లో దొంగలు పడ్డారు. నవంబర్ 29వ తేదీ రాత్రి ఈ దొంగతనం జరిగిందని థరూర్ పోలీసులకు తెలిపారు. థరూర్ కార్యాలయం తాళాలు పగిలి ఉండటాన

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2016 (11:51 IST)
కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ఇంట్లో దొంగలు పడ్డారు. నవంబర్ 29వ తేదీ రాత్రి ఈ దొంగతనం జరిగిందని థరూర్ పోలీసులకు తెలిపారు. థరూర్ కార్యాలయం తాళాలు పగిలి ఉండటాన్ని ఆయన ఇంట్లో పనిచేసేవారిలో ఒకరు గుర్తించి తెలిపారు. ఈ భవనం మెయిన్‌ రోడ్డులోనే ఉండటంతో, ప్రహరీ ఎక్కి లోనికి ప్రవేశించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వీధుల్లో తిరిగేవాళ్లు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటారని, వాళ్లకు ఇక్కడకు సమీపంలోని సాయి ఆలయం వాళ్లు వారికి దుస్తులు ఇస్తారని, అందుకే ఇక్కడ తిరుగుతూ దొంగతనాలు చేస్తారని చెప్పారు.
 
చోరీకి పాల్పడిన దొంగలు థరూర్ ఇంటి సమీపం నుంచి ఒక ప్రకటన బోర్డుతో పాటు.. ఆరు విగ్రహాలు, ఒక యాంటిక్ పీస్‌తో పాటు రాగి కళ్లజోడును చోరీ చేసినట్టు తెలిపారు. ఇంతకుముందు కూడా విగ్రహాలు చోరీచేసిన ఒక గ్యాంగ్ హస్తాన్ని అనుమానిస్తున్నట్లు న్యూఢిల్లీ డీసీపీ జతిన్ నర్వాల్ చెప్పారు. మెయిన్‌గేటు తాళాలు వేసినవి వేసినట్లే ఉన్నాయని థరూర్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. రోడ్డుమీద ఉన్న ఫుట్‌పాత్ నుంచి ప్రహరీ ఎక్కడం చాలా సులభమన్నారు. ఈ చోరీపై పోలీసులు తుగ్లక్ రోడ్డు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments