Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టినరోజు పార్టీకి పిలిచి మద్యం పోసి అత్యాచారం, తెల్లారి లేచి షాక్ తిన్న యువతి

Webdunia
మంగళవారం, 29 డిశెంబరు 2020 (15:48 IST)
సోషల్ మీడియా ద్వారా పరిచయమైన యువకుడు. అతని సందేశాలు చూసి ఆకర్షణకు గురైంది యువతి. మంచి వ్యక్తి అనుకుంది. అందుకే పిలిచిన వెంటనే వెళ్ళింది. కానీ చివరకు నమ్మిన వ్యక్తే దారుణంగా అత్యాచారం చేస్తాడని ఊహించలేదు. లబోదిబోమంటూ చివరకు పోలీసులను ఆశ్రయించింది.
 
పుణేలోని హింజెవాడీలోని నివాససముండే మహిళకు సోషల్ మీడియా ద్వారా యువకుడు పరిచయమయ్యాడు. తాను ఉంటున్న ప్రాంతానికి సమీపంలోనే అతను ఉండేవాడు. దీంతో ఆ యువతి అతనికి దగ్గరైంది. ఆన్‌లైన్ పరిచయం కాస్తా స్నేహానికి దారితీసింది.
 
స్నేహితుడిగా అతన్ని నమ్మింది. అతని పేరు పంకజ్. బర్త్ డే పార్టీ ఉందని మూడురోజుల క్రితం ఇంటికి పిలిచాడు. ఇంట్లో ఫంక్షన్ మొత్తం పూర్తయ్యింది. హోటల్లో తన ఫ్రెండ్స్ ఉన్నారని.. నువ్వు వస్తే బాగుంటుంది... కాసేపు ఉండి ఆ తరువాత వెళ్ళిపో అన్నాడు. దీంతో పంకజ్ మాటలు నమ్మి హోటల్ గదికి వెళ్ళింది.
 
హోటల్ గదిలో ఎవరూ లేరు. కానీ పంకజ్ మాత్రం ఫ్రెండ్స్ మరికాసేపట్లో వస్తారని మద్యం తాగడం ప్రారంభించాడు. వద్దన్నా యువతికి కూడా తాగించాడు. ఫుల్లుగా మద్యం తాగించడంతో ఆ యువతి స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెపై అత్యాచారం చేశాడు పంకజ్.
 
చివరిక తెల్లవారుజామున యువతి లేచి చూసే సరికి తన ఒంటిపై బట్టలు లేవు. దీంతో తను మోసపోయానని తెలుసుకుని అతడి గది నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు పంకజ్ పరారీలో ఉన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments