Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కడ మహిళ రొమ్ములకు పన్ను, కట్టమన్నందుకు కోసిచ్చేసింది...

Webdunia
శనివారం, 13 మార్చి 2021 (20:40 IST)
రాచరిక వ్యవస్థలు రకరకాలు. కొంతమంది రాజుల పరిపాలనలో ప్రజలు ప్రాణాలను బిగబట్టుకుని బ్రతికేవారు. మరికొంతమంది స్వేచ్ఛాస్వాతంత్రాలను ప్రసాదించేవారు. ఇంకొందరు జుట్టుపై పన్నులు విధించిన దాఖలాలు వున్నాయి. ఐతే మహిళల రొమ్ములపై పన్ను వేసిన రాజులూ వున్నారంటే నమ్ముతారా? ఇది నిజం. కేరళలో ఒకప్పుడు ట్రావెన్కో సంస్థానం పరిపాలన సాగింది.
 
 ఆ కాలంలో ఉన్నతవర్గాలకు చెందిన మహిళలు తప్ప నిమ్న, పేద వర్గాల మహిళలు తమ రొమ్ములను కప్పుకుని తిరగరాదు. అంతేకాదు... అలా పైవస్త్రం లేకుండా తిరిగే మహిళల రొమ్ములను చూసి పన్ను విధించేవారు. రొమ్ము సైజులను బట్టి పన్ను విధింపు వుండేది. పరిమాణంలో పెద్ద సైజులున్నట్లయితే వారు డబ్బున్నవారనీ, ధనం అధికంగా వున్నందువల్ల వారు బాగా తిండి తిని ఇలా వారి రొమ్ము ఆకృతులు పెరిగాయని అధికారులు అంచనా వేసేవారు.
 
దాంతో మరింత పన్ను వడ్డింపు విధించేవారు. ఈ దారుణ చట్టాన్ని లోపల అగ్నిని దాచుకుంటూనే భరిస్తూ వచ్చేవారు. ఎవరైనా మహిళ పన్ను కట్టను అని ఎదురు తిరిగితే ఆమె భర్త ముందే చిత్రహింసలకు గురిచేసేవారు. అత్యాచారాలకు పాల్పడేవారు. ఈ దారుణాన్ని తట్టుకోలేక కొందరు మహిళలు ప్రాణత్యాగం చేసేవారు. అధికారులకు భయపడి పేద, నిమ్న వర్గాల మహిళలు పైవస్త్రం లేకుండా రొమ్ములు బహిరంగంగా కనబడే విధంగా తిరగాల్సి వచ్చేది.
 
ఐతే ఎంత అదిమిపెడితే అల్లంత ఎత్తున ఉద్యమం కెరటంలా ఎగుస్తుందనేందుకు బీజం ఓ స్త్రీ నాటింది. ఆమె పేరు నంగేలీ. ఆమె తన ఎద భాగాన్ని పైకి కనిపించకుండా వస్త్రం కప్పుకుని తిరిగేది. అధికారులు హెచ్చరించినా పట్టించుకునేది కాదు. స్త్రీ శరీరంలో సహజసిద్ధమైన రొమ్ములకు పన్ను ఎందుకు కట్టాలంటూ గట్టిగా నిలదీసేది. అలా ఆమె ధైర్యంగా ప్రశ్నించడం చూసి ఆమెకి వెన్నుదన్నుగా మరికొందరు రావడం మొదలైంది. ఆమెను అలా వదిలేస్తే తిరుగుబావుటా పెరిగుతుందని భావించిన ట్రావెన్కోర్ సంస్థానాధీశులు ఆమెను బంధించి, బలవంతంగా పన్ను వసూలు చేయాలని హుకుం జారీ చేసారు. దీనితో ఆమె ఇంటి చుట్టూ సైనికులు చుట్టుముట్టారు.
 
అధికారులు ఆమె దగ్గరకెళ్లి పన్ను కట్టాలని గద్దాయించారు. ఆమె ససేమిరా అంది. దాంతో ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. పెనుగులాడి వారి నుంచి విడిపించుకున్న నంగేలీ పన్ను కడతానంటూ చెప్పింది. దీనితో ఆమెను వదిలేసి డబ్బు తీసుకురమ్మన్నారు. వెంటనే ఆమె తన ఇంట్లోకి వెళ్లి... లోపల పదునైన కత్తి తీసుకుని తన రెండు రొమ్ములను కోసి అరిటి ఆకులో పెట్టి... వీటికేగా మీరు పన్ను అడుగుతుంది. వాటినే ఇస్తున్నా తీసుకోండి అంటూ ఎద నుంచి ధారాపాతంగా రక్తమోడుతున్న శరీరంతో చెప్పింది.
 
ఈ హఠాత్పరిణామానికి భయపడిన అధికారులు అక్కడి నుంచి పరుగులు తీసారు. రక్తమోడుతూ నంగేలీ అక్కడే నేలకొరిగి ప్రాణాలు కోల్పోయింది. ఆమెకు దహన కార్యాలు చేస్తుండగా ఆమెను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి భర్త అదే చితిలో దూకి ఆత్మార్పణ చేసాడు. వారిద్దరి మరణంతో అక్కడ ఉద్యమం ఉవ్వెత్తు ఎగసింది. ఆ చట్టాన్ని ఉక్కుపాదంతో తొక్కి రాజులు విధించిన బానిస సంకెళ్లను తెంపేసింది. అందుకే ఇప్పటికీ అక్కడ నంగేలీకి జోహార్లు అర్పిస్తుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments