Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పీడు పోస్టు ద్వారా అయ్యప్ప ప్రసాదం.. భక్తులకు మరో గుడ్ న్యూస్

Webdunia
గురువారం, 3 డిశెంబరు 2020 (14:31 IST)
శబరిమల దేవాలయం నుంచి స్వామివారి ప్రసాదాన్ని స్పీడు పోస్టు ద్వారా భక్తులకు చేరవేయాలని భారత తపాలా శాఖ నిర్ణయించింది. తపాలా శాఖ తనకున్న విస్తారమైన నెట్‌ వర్కును ఉపయోగించి దేశం నలుమూలల ఉన్న భక్తులకు ప్రసాదాన్ని ఇంటివద్ద కే డెలివరీ చేయాలని నిర్ణయించింది.

దీనికోసం కేరళ పోస్టల్‌ సర్కిల్‌ ట్రావెన్‌ కోర్‌ దేవస్థానం బోర్డుతో ఒప్పందం కుదుర్చుకుంది. శబరిమల ప్రసాదం ప్యాకెట్‌ ను 450 రూపాయలు చెల్లించి భక్తులు ఏ పోస్టాఫీసు నుంచి అయినా బుక్ చేసుకోవచ్చు.
 
మరోవైపు కేరళ ప్రభుత్వం అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పింది. శబరిమలకు అనుమతించే భక్తుల సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. శని, ఆదివారాల్లో అయ్యప్పను దర్శించుకునేందుకు మూడువేల మంది భక్తులకు అనుమతి ఇచ్చింది. మిగతారోజుల్లో ప్రతిరోజు రెండు వేల మంది భక్తులకు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కేరళ రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ ఓ ప్రకటనలో తెలిపారు. 
 
ఇప్పటివరకు సాధారణ రోజుల్లో రోజకు వెయ్యి మంది, శని, ఆది వారాల్లో రోజుకు 2వేల మంది భక్తులను దర్శనం కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయ్యప్ప దర్శనం కోసం ఆన్‌లైన్‌లోనే టికెట్ బుకింగ్ సదుపాయం కల్పించారు. అయితే కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేడు సినీ పరిశ్రమ తరఫున అభినందనలు మాత్రమే - మరోసారి సమస్యలపై చర్చ

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌తో టాలీవుడ్ నిర్మాతల భేటీ!

పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన అగ్ర నిర్మాతలు - చిన్న నిర్మాతలు అలక

కళ్యాణ్ రామ్‌ యాక్షన్‌ చిత్రంలో విజయశాంతి

కాశ్మీర్ వ్యాలీలో మిస్టర్ బచ్చన్ కోసం మెలోడీ డ్యూయెట్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments