Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీలోని దెయ్యం పిల్ల బయటికి వచ్చేసింది.. భయంతో పరుగులు తీసిన కస్టమర్లు..

అదో టీవీ స్టోర్. టీవీలో దెయ్యం కనిపిస్తుంది. ఉన్నట్టుండి టీవీలోని దెయ్యం కాస్త నేల మీదకొచ్చింది. అంతే షాపులో ఉన్నవారంతా ఖంగుతిన్నారు. టీవీ కొందామని వచ్చిన వారంతా భయంతో జడుసుకున్నారు. ఇదంతా న్యూయార్క్‌

Webdunia
సోమవారం, 30 జనవరి 2017 (11:29 IST)
అదో టీవీ స్టోర్. టీవీలో దెయ్యం కనిపిస్తుంది. ఉన్నట్టుండి టీవీలోని దెయ్యం కాస్త నేల మీదకొచ్చింది. అంతే షాపులో ఉన్నవారంతా ఖంగుతిన్నారు. టీవీ కొందామని వచ్చిన వారంతా భయంతో జడుసుకున్నారు. ఇదంతా న్యూయార్క్‌లోని టీవీ స్టోర్‌లో చోటుచేసుకుంది. ఆ షాపులో కొన్ని వంద‌ల సంఖ్య‌లో టీవీలున్నాయి. వాటిని కొనుగోలు చేసేందుకు క‌స్ట‌మ‌ర్లు వ‌స్తున్నారు. 
 
అయితే అప్పుడే స‌డెన్‌గా ఓ టీవీలో నుంచి దెయ్యం పిల్ల బ‌య‌టికి వ‌చ్చింది. దీంతో టీవీల‌ను కొనాల‌ని అక్క‌డికి వ‌చ్చిన వారు ఒక్క‌సారిగా భ‌యం చెంది, ఉలిక్కి ప‌డి ప‌రుగు లంకించుకున్నారు. అయితే… నిజానికి చెప్పాలంటే అది రియ‌ల్ దెయ్యం పిల్ల కాదు. ఆ టీవీ స్టోర్ వారు ఏర్పాటు చేసిందే.
 
క‌స్ట‌మ‌ర్లు రావ‌డానికి ముందే ఓ టీవీ వెనుక చిన్న‌పాటి గ‌ది ఏర్పాటు చేసి అందులో ఓ బాలిక‌ను అచ్చం ది రింగ్ ఇంగ్లిష్ సినిమాలోని దెయ్యం పిల్ల‌లాగా ఉంచారు. ఇంకేముంది.. కస్టమర్లు రాగానే ఆ పిల్ల కాస్తా టీవీని తప్పించి బయటకు వచ్చేసింది. అంతే కస్టమర్లు భయంతో పరుగులు తీశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments