Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాచిపట్టిన గోడలు.. చీకటి గదులు.. కుమరి బాయ్స్ అలా మార్చేశారు..?

సెల్వి
సోమవారం, 10 జూన్ 2024 (14:10 IST)
Kumari Boys
ప్రజాసేవ చేసేందుకు ప్రస్తుతం రాజకీయ నేతలే మనకెందుకని సైలెంట్‌గా వుండిపోతున్నారు. ప్రజల్లోనే చాలామంది సామాజిక సేవ పట్ల ఆసక్తి చూపట్లేదు. వెయ్యిలో ఒకరే ప్రస్తుతం ఇతరులకు సాయం చేసేందుకు.. సామాజిక సేవ కోసం ముందుకు వస్తున్నారు. అయితే ఇక్కడ యువత సామాజిక సేవ చేసేందుకు సై అంటోంది. 
 
"కుమరి బాయ్స్" అనే ట్యాగ్‌తో యువకులు తమిళనాడులోని ఓ ప్రభుత్వ పాఠశాలను సుందరంగా తీర్చి దిద్దింది. కళావిహీనంగా.. పాచిపట్టిన గోడలతో, చీకటితో కూడిన తరగతి గదులతో కూడిన తమిళనాడు నాగర్ కోయిల్, కన్యాకుమారిలోని ఓ పాడుపడిన పాఠశాలను కుమరి బాయ్స్ అందంగా మార్చేశారు. ప్రభుత్వ పాఠశాలను అందంగా రంగులతో తీర్చిదిద్దారు. ఇలాంటి ఎన్నో సహాయ కార్యక్రమాలలో ఈ బాయ్స్ పాల్గొంటారు. 
 
ఈ స్కూల్‌ను మెరుగుదిద్దడం కోసం లక్ష రూపాయల వరకు ఖర్చు అయినట్లు ఆ బాయ్స్ చెప్పారు. నాగర్ కోయిల్ పరిసర ప్రాంతాల్లో చెట్లు నాటడం, కాలేజీలను నిర్మించడం వంటి పనులు చేస్తున్నామని.. ఈసారి ప్రభుత్వ పాఠశాలను చూశామని ఈ పాఠశాలలో చదివే విద్యార్థులకు స్కూల్‌ను చూస్తే  ఆకట్టుకునే రీతిలో వెలుతురు వంటి వివిధ రకాలపై సౌకర్యాలతో, పరిశుభ్రతతో కూడిన వాతావరణాన్ని కల్పించాలని ఈ పని చేసినట్లు యువకులు వెల్లడించారు.

ఈ పనుల్లో వాలంటీర్లు కూడా భాగం అయ్యారని... ఈ ప్రాజెక్టు కోసం రూ. ఒకలక్షా 20వేల రూపాయల వరకు అంచనా వేశామని.. ఇప్పటివరకు రూ. లక్షా ఐదు వేలు ఖర్చు అయినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలను ఇంత అందంగా తీర్చిదిద్దడం ద్వారా విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో చేరే అవకాశం వుంటుందనే ఉద్దేశంతో ఈ పని చేసినట్లు యువకులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీర్ఘాయుష్మాన్ భవ.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments