Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైఋతి రుతుపవనాల విస్తరణ

Webdunia
ఆదివారం, 7 జూన్ 2020 (18:48 IST)
దక్షిణ ఇంటీరియర్  కర్ణాటక, రాయలసీమలోని కొన్నిప్రాంతాలు, తమిళనాడులోని చాలా ప్రాంతాలు, నైఋతి బంగాళాఖాతం మరియు తూర్పు మధ్య బంగాళాఖాతంలో మొత్తం ప్రాంతాలు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరి కొన్ని ప్రాంతాలు,  వాయువ్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలు, ఈశాన్య బంగాళాఖాతంలో మరి కొన్ని ప్రాంతాలలోనికి నైఋతి రుతుపవనాలు విస్తరించాయి.
 
మధ్య అరేబియా సముద్రం, గోవా, కొంకన్ లో కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలో మరియు రాయలసీమలో మరికొన్ని ప్రాంతాలు, తమిళనాడులో మిగిలిన ప్రాంతాలు, కోస్తా ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలు, మధ్య బంగాళాఖాతం మరియు ఉత్తర బంగాళాఖాతంలో మరి కొన్ని ప్రాంతాలు, ఈశాన్య భారతదేశంలో కొన్ని ప్రాంతాలలోనికి నైఋతి రుతుపవనాలు రాగల 2 నుండి 3 రోజులలో విస్తరించే అవకాశం ఉంది.
 
తదుపరి 2 రోజులలో మహారాష్ట్ర, కర్ణాటక లో మరికొన్ని ప్రాంతాలు, తెలంగాణలో కొన్ని ప్రాంతాలు, కోస్తా ఆంధ్రాలో మరికొన్ని ప్రాంతాలు, బంగాళాఖాతం మరియు ఈశాన్య భారతదేశం లో మిగిలిన ప్రాంతాలు, సిక్కిం, ఒరిస్సా మరియు గాంగేటిక్ పశ్చిమబెంగాల్ లో కొన్ని ప్రాంతాలకు నైఋతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది.
 
తూర్పు మధ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకొని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతాలలో  మధ్య ట్రోపోస్పియర్ స్థాయిలు ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దీని ప్రభావం వలన రాగల 48 గంటలో తూర్పు మధ్య  బంగాళాఖాతం ప్రాంతాలలో  అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన :  
      
ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం :
ఈరోజు  ఉరుములు, మెరుపులు తో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో  తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల  కురిసే అవకాశం ఉంది మరియు  భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

రేపు, ఎల్లుండి  ఉరుములు, మెరుపులు తో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో  తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల  కురిసే అవకాశం ఉంది మరియు  భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
 
దక్షిణ కోస్తా ఆంధ్ర :   
ఈ రోజు ఉరుములు, మెరుపులుతో పాటు దక్షిణ కోస్తా ఆంధ్రాలో  తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

రేపు  ఉరుములు, మెరుపులుతో పాటు దక్షిణ కోస్తా ఆంధ్రాలో  తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

ఎల్లుండి  ఉరుములు, మెరుపులుతో పాటు దక్షిణ కోస్తా ఆంధ్రాలో  తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది మరియు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
 
రాయలసీమ :
ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులుతో పాటు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ  కురిసే అవకాశం ఉంది.

ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల  కురిసే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments