Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై సోనూ పాటలే వింటావా.. అయితే చావు.. నిజంగానే చంపేసిన ముష్కరులు

లౌడ్ స్పీకర్లలో తెల్లవారు జామునే ఎందుకు నమాజ్ పేరుతో నిద్రపోనీయకుండా చంపుతారు అంటూ ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్‌ బహిరంగ విమర్శను చేసినందుకు అతనిపై ఫత్వా జారీ చేస్తాడు ఒక ప్రబుద్దుడు. (అసలుకు అతగాడు ఇమామే కాదని తాజా వార్త). సోనూనిగమ్ ధైర్యానికి

Webdunia
శనివారం, 22 ఏప్రియల్ 2017 (01:51 IST)
దేశంలో మతోన్మాదానికి, మతమౌఢ్యానికి ఇంతకుమించిన ఉదాహరణ లేదు. లౌడ్ స్పీకర్లలో తెల్లవారు జామునే ఎందుకు నమాజ్ పేరుతో నిద్రపోనీయకుండా చంపుతారు అంటూ ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్‌ బహిరంగ విమర్శను చేసినందుకు అతనిపై ఫత్వా జారీ చేస్తాడు ఒక ప్రబుద్దుడు. (అసలుకు అతగాడు ఇమామే కాదని తాజా వార్త). సోనూనిగమ్ ధైర్యానికి మెచ్చుకుంటూ అతడికి సపోర్టు చేస్తూ ఫేస్‌బుక్‍‌లో పోస్ట్ చేసినందుకు ఒక బాలుడిని పట్టుకుని దారుణంగా చంపేస్తారు కొందరు మతోన్మాదులు. మతం ఏదైనా కావచ్చు.. దాన్ని స్వప్రయోజనాలకు, ఉనికిలో ఉన్న రాజకీయాలకు వాడుకునే ఉన్మాదపు తెగలు ప్రపంచంలోకి వచ్చి పడ్డాక భిన్నాభిప్రాయం ప్రకటించిన పాపానికి రక్తప్రతీకారమే పరిష్కారం అయిపోతోంది. సోనూ నిగమ్ పాలటే వింటాను అని ఒకబ్బాయి అంటేనే వివాదం కొనసాగించి నేరుగా వెతుక్కుంటూ వచ్చి చంపేసిపోతే. ఇక ఈ దేశంలో సహనానికి, భిన్నాభిప్రాయ ప్రకటనకు, విమర్శకు తావెక్కడ?
 
వివరాల్లోకి వెళితే ప్రముఖ బాలీవుడ్‌ గాయకుడు సోనూనిగమ్‌కి మద్దతుగా మాట్లాడినందుకు ఓ బాలుడిని దారుణంగా పొడిచి చంపారు. ‘ఆజాన్‌’ పిలుపుపై చేసిన అనుచిత వ్యాఖ్యలతో సోనూనిగమ్‌ వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సోనూ చేసిన వ్యాఖ్యలకు పలువురు మద్దతు తెలపగా మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన శివమ్‌ అనే బాలుడు సోనూ నిగమ్‌కి మద్దతు తెలుపుతూ ఫేస్‌బుక్‌లో ‘నేను ఇక సోనూనిగమ్‌ పాటలే వింటాను’ అని పోస్ట్‌ చేశాడు. 
 
దాంతో శివమ్‌కి ఇదే ప్రాంతానికి చెందిన ఫైజన్‌ ఖాన్‌ అనే వ్యక్తికి మధ్య వివాదం నెలకొంది. మాటామాటా పెరగడంతో కోపాన్ని అదుపు చేసుకోలేకపోయిన ఫైజాన్‌ మరో ఎనిమిది మంది స్నేహితులతో వచ్చి శివమ్‌ని కత్తితో పొడిచి చంపేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
తన ఇంటి సమీపంలోని మసీదు నుంచి వినిపించే ఆజాన్‌ పిలుపుతో నిద్ర మేల్కొనాల్సి వస్తోందని ఇలాంటి లౌడ్‌స్పీకర్లు ఆలయాల్లో, మసీదుల్లో ఉండకూడదని సోనూనిగమ్‌ ట్విటర్‌లో వ్యాఖ్యలు చేశాడు. దీనిపై పశ్చిమ్‌బెంగాల్‌కి చెందిన ఓ మౌలావి(మత పెద్ద) సోనూపై ఫత్వా వేశాడు. సోనూకి గుండు కొట్టించి చెప్పుల దండ వేసి దేశమంతటా వూరేగిస్తే వారికి రూ.10 లక్షలు ఇస్తానని చెప్పాడు. దాంతో సోనూ నిజంగానే గుండు గీయించేసుకుకోవడమే కాకుండా ఆ పది లక్షలూ తనకే ఇవ్వమని  డిమాండ్ చేశాడు సోనూ.  అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన మరో విషయం ఏంటంటే.. ఫత్వా జారీ చేసిన మౌలావి అసలు ఇమామే కాదని వార్తలు.
 
ఇంతలోనే ఉజ్జయనిలో ఘోరం జరిగిపోయింది. మసీదు గొడవలు, మందర్ గొడవలు ఎంత ప్రాణాంతకమవుతాయో తెలీని పసివయస్సులో సోనూ ధైర్యప్రకటనకు ఉత్తేజం పొంది ఇకపై మీ పాటలే పాటతాను సోనూ అంటూ పోస్ట్ చేసిన తప్పుకు ఆ అబ్బాయి నిండుప్రాణం బలైపోయింది.
 
మనుషుల ప్రాణాలను లెక్కచేయని, నిలువునా చంపేసి గాని నిద్రపోని మతాలు ఈ 21వ శతాబ్దంలోనూ కొనసాగుతున్నయంటే చంద్రబాబు గారి మాటల్లో చెప్పాలంటే.. మనమెక్కడికి పోతున్నాం....
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments