హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

ఠాగూర్
శుక్రవారం, 20 డిశెంబరు 2024 (19:21 IST)
కొత్తగా వివాహం చేసుకున్న తన కుమార్తె - అల్లుడు హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలన్న అంశంపై మామా అల్లుళ్ల మధ్య పెను వివాదాన్ని సృష్టించింది. మామ మాటను అల్లుడు కాదన్నాడు. దీన్ని భరించలేని మామ.. కుమార్తె భర్త, ఇంటికి అల్లుడు అని కూడా చూడకుండా యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని రాణె జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాణి జిల్లా కల్యాణ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న జకీ గులామ్ ముర్తజా ఖోటాల్ (65) ఇటీవల తన కూతురును ఇబాద్ అతీక్ ఫాల్కే (29)కు ఇచ్చి వివాహం చేశాడు. హనీమూన్ వెళ్లే విషయంపై మామాఅల్లుళ్ల మధ్య వివాదం రేగింది. కాశ్మీర్‌కు వెళతామని ఫాల్కే చెప్పగా, వద్దు విదేశాల్లోని ఆధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్లండని ఖోటాల్ సూచించాడు. 
 
ఈ విషయంపై ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. గొడవ పెద్దదవుతుండడంతో ఇంట్లో వాళ్లు కలగజేసుకున్నారు. దీంతో ఖోటాల్ తాత్కాలికంగా వెనక్కితగ్గాడు. అయితే, ఖోటాల్‌కు తన మాట కాదన్నందుకు అల్లుడిపై కోపం మాత్రం తగ్గలేదు. సాయంత్రం యాసిడ్ సంపాదించి అల్లుడి ఇంటి దగ్గర కాపుకాచాడు. 
 
తన కారులో కూర్చుని అల్లుడు వచ్చే వరకు ఎదురుచూశాడు. ఆఫీసు నుంచి ఇంటికి చేరుకున్న ఫాల్కే.. రోడ్డు పక్కన తన స్కూటర్ పార్క్ చేసి ఇంట్లోకి వెళుతుండగా ఖోటాల్ ఉన్నట్టుండి ఎదురు వచ్చి యాసిడ్ చల్లి పారిపోయాడు. చుట్టుపక్కల వాళ్లు ఫాల్కేను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఫాల్కే కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న ఖోటాల్ కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments