Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ నుంచే ఆ ముష్కరులొచ్చారు: రాజ్ నాథ్ సింగ్ ప్రకటన

Webdunia
గురువారం, 30 జులై 2015 (15:37 IST)
పంజాబ్‌లోని గురుదాస్ పూర్‌పై దాడి చేసిన టెర్రరిస్టులు పాకిస్థాన్ నుంచి వచ్చారని పార్లమెంట్‌లో కేంద్రో హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన ముగ్గురు టెర్రరిస్టులు సైనిక దుస్తుల్లో ఉన్నారని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. 12 గంటల పాటు కొనసాగిన ఆపరేషన్‌లో ముష్కరులను మట్టుబెట్టిన తర్వాత వారి వద్ద జీపీఎస్ పరికరాలు లభించాయన్నారు. వాటి ప్రకారం ఉగ్రవాదులు పాక్ భూభాగం నుంచి రావి నదిని దాటి వచ్చారని స్పష్టమయిందని తెలిపారు. 
 
దాడికి పాల్పడిన ముగ్గురు టెర్రరిస్టులు సైనిక దుస్తుల్లో ఉన్నారని... వారి వద్ద ఏకే47లు, చైనా తయారీ గ్రెనేడ్‌లు ఉన్నాయని రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. కనీసం ఒక్క ఉగ్రవాదినైనా ప్రాణాలతో పట్టుకోవాలని సెక్యూరిటీ ఫోర్సెస్ ప్రయత్నించినప్పటికీ వీలు కాలేదన్నారు. కాగా పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా దీనానగర్‌లో విధ్వంసానికి తెగబడ్డ ముష్కరులు పాకిస్థాన్‌ నుంచే దేశంలోకి చొరబడ్డారని తేలింది. ఈ మేరకు పాకిస్థాన్ సరిహద్దు నుంచి వారు భారత భూభాగంలోకి చొరబడుతున్న దృశ్యాలను ఓ జాతీయ వార్తా ఛానెల్ ప్రసారం చేసింది.
 
పాకిస్థాన్ భూభాగం నుంచి ఈ నెల 27న తెల్లవారుజామున తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు అటుగా వెళుతున్న బస్సుపై తొలుత కాల్పులు జరిపారు. ఆ తర్వాత దీనానగర్ పోలీస్ స్టేషన్‌పై మూకుమ్మడి దాడి చేశారు. అయితే క్షణాల్లో మేల్కొన్న పోలీసులు ఉగ్రవాదులు బుద్ధి చెప్పారు. ఈ సందర్భంగా గంటల తరబడి జరిగిన కాల్పుల్లో నలుగురు పోలీసులు సహా ఏడుగురు మృతిచెందగా, పోలీసుల చేతిలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ముష్కరుడిని పోలీసులు సజీవంగా పట్టుకున్న సంగతి తెలిసిందే.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments