Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరిహద్దుల్లో భారత సైనికుడిని ముక్కలుగా నరికిన ఉగ్రవాదులు

పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. భారత సైనికుడిని ముక్కలు ముక్కలుగా నరికివేశారు. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లుపొడుస్తూ, భారత పోస్టులు, సరిహద్దు గ్రామాలపై కాల్పులకు తెగబడింది. ఈ

Webdunia
శనివారం, 29 అక్టోబరు 2016 (11:28 IST)
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. భారత సైనికుడిని ముక్కలు ముక్కలుగా నరికివేశారు. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లుపొడుస్తూ, భారత పోస్టులు, సరిహద్దు గ్రామాలపై కాల్పులకు తెగబడింది. ఈ క్రమంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు బీఎస్ఎఫ్‌కు చెందిన ఒక సైనికుడిని అత్యంత అమానుషంగా హతమార్చింది. 
 
జమ్మూకాశ్మీర్‌లోకి చొరపడిన ఉగ్రవాదులపై కాల్పులు జరుపుతూ వెళ్లిన సైనికుడిని ముక్కలు ముక్కలుగా నరికి చంపారు. కుప్వారా జిల్లాలోని మచ్చిల్ సెక్టార్‌లో సైనికుడు తల, శరీర భాగాలను ఖండించారని బీఎస్ఎఫ్ తెలిపింది. 
 
అయితే అంతకుఅంత ప్రతీకారం తీర్చుకుంటామని వారు హెచ్చరించారు. ఈ దాడి సైనికుల సమక్షంలోనే జరిగి ఉంటుందని వారు అనుమానం వ్యక్తం చేశారు. కాగా, సరిహద్దుల్లోని కథువా సెక్టార్, కెరి, హిరానగర్‌, ఆర్ఎస్ పురా, మెందార్‌, పూంఛ్‌ సెక్టార్‌‌లలో కాల్పులకు తెగబడిందని వారు తెలిపారు.
 
ఇదిలావుండగా, పాక్ చొరబాటుదారులు మరోసారి రెచ్చిపోయారు. జమ్మూకాశ్మీర్‌లోని మచిల్ సెక్టార్‌లోకి ఉగ్రవాదులు చొరబడి కాల్పులు జరిపారు. ఈ విషయాన్ని కనిపెట్టిన భారత జావాన్లు వారిపై కాల్పులు జరిపారు. జవాన్ల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎదురుకాల్పుల్లో మంజీర్ సింగ్ అనే భారత జవాను చనిపోయాడు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

Ram charan: రామ్ చరణ్ గడ్డం, వెనుకకు లాగిన జుట్టు జిమ్ బాడీతో పెద్ది కోసం సిద్ధం

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments