Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానం ఎక్కుతుండగా మహిళకు గుండెపోటు.. అక్కడే మృతి

Webdunia
సోమవారం, 30 అక్టోబరు 2023 (09:16 IST)
ఛండీగఢ్ విమానాశ్రయంలో విషాదకర ఘటన ఒకటి జరిగింది. విమానం ఎక్కుతుండగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ మహిళకు గుండెపోటు వచ్చి అక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం చిన్ననారాయణపురం సర్పంచి కె.నర్సింహా భార్య ఇందిరాబాబు (48). డ్వాక్రా ఉద్యోగిని. స్థానికంగా సీఆర్‌పీగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పంజాబ్‌లోని సీఆర్పీలకు నెల రోజుల పాటు నిర్వహించే అవగాహన సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా 400 మందిని ఎంపిక చేయగా, వీరిలో ఇందిరాబాబు కూడా ఒకరు. ఈ అవగాహన సదస్సుకు వెళ్లిన ఆమె... సదస్సులను విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్ నగరానికి తిరుగుపయనమయ్యారు. 
 
వీరంతా ఛండీగఢ్‌ విమానాశ్రయంలో ఫ్లైట్ ఎక్కుతుండగా, ఆమె ఆకస్మికంగా గుండెపోటు గురయ్యారు. దీంతో ఆమెను ఎయిర్‌పోర్టు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. అలాగే హర్యానా గవర్నర్‌గా ఉన్న బండారు దత్తాత్రేయ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఆయన తక్షణం స్పందించి, ప్రభుత్వంతో మాట్లాడి ఆ మృతదేహాన్ని స్వగ్రామానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. దీంతో ఆదివారం ఇందిరాబాబు మృతదేహం గ్రామానికి చేరుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments