Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో మొదలై.. ముంబైలో పెళ్ళిపీటలెక్కి.. విషాదం మిగిల్చిన ప్రేమకథ..

తెలంగాణలో ఓ ప్రేమకథ విషాదాంతమైంది. తెలంగాణలోని ఓ కాలేజీలో మొదలైన ఈ ప్రేమకథ.. ముంబైలో పెళ్ళి పీటలెక్కినప్పటికీ.. కోర్టు ఆదేశాలతో కోర్టు ముందు ప్రవేశపెట్టే లోపే విషాదం మిగిల్చింది. కోర్టులో ప్రవేశపెడతార

Webdunia
బుధవారం, 17 మే 2017 (19:22 IST)
తెలంగాణలో ఓ ప్రేమకథ విషాదాంతమైంది. తెలంగాణలోని ఓ కాలేజీలో మొదలైన ఈ ప్రేమకథ.. ముంబైలో పెళ్ళి పీటలెక్కినప్పటికీ.. కోర్టు ఆదేశాలతో కోర్టు ముందు ప్రవేశపెట్టే లోపే విషాదం మిగిల్చింది. కోర్టులో ప్రవేశపెడతారనే అవమానంతో 20 గంటల ముందు యువతి ఆత్మహత్య చేసుకోగా, ఆ యువకుడి పరిస్థితి ఏంటో తెలియరాలేదు. అతను ఎక్కడున్నాడో వివరాలు తెలియలేదు. 
 
వివరాల్లోకి వెళితే.. అంబోజి నరేష్, తుమ్మల స్వాతిలు కాలేజీలో చదువుకుంటున్న సమయంలో ప్రేమలో పడి, ఈ సంవత్సరం మార్చి 25న వివాహం చేసుకుని ముంబైలో కాపురం పెట్టారు. నరేష్‌తో పోలిస్తే, స్వాతి అగ్రవర్ణాలకు చెందిన అమ్మాయి కావడంతో, ఆమె తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో స్వాతి, నరేష్‌తో కలసి వెళ్లిపోయింది.
 
ఆపై స్వాతి ఎక్కడున్నారో కనుగొన్న ఆమె తల్లిదండ్రులు ఇంటికి రమ్మని పిలిపించి.. ఆమెను తీసుకెళ్లిపోయారు. నరేశ్ అదృశ్యమయ్యాడు. అయితే ఇంతలో ఏమైందో ఏమో కానీ స్వాతి ఆత్మహత్యకు పాల్పడింది. నరేష్ ఆచూకీ తెలియరాలేదు. ఈ కేసుపై లోతుగా విచారించాలని కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments