Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమల్నాథన్ కమిటీ మా సూచనలు పట్టించుకోలేదు : 'T' ఉద్యోగులు

Webdunia
శనివారం, 26 జులై 2014 (13:54 IST)
ఉద్యోగుల విభజనపై కమల్నాథన్ కమిటీ చేసిన మార్గదర్శకాలపై తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. స్థానికత అంశంలో తాము చేసిన సూచనలు కమిటీ ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు కదా.. అసలు పట్టించుకోలేదని ఆరోపించారు.

కమల్నాథన్ కమిటీ ఉద్యోగుల విభజనపై మార్గదర్శకాలను వైబ్‌సైట్‌లో పొందుపర్చిన అనంతరం తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారని, స్థానికతపై తమ విజ్ఞప్తులు ఇప్పటికైనా పరిగణలోకి తీసుకోవాలని కోరారు. 
 
స్థానికత నిర్ధారణకు సరైన యంత్రాంగమంటూ లేదని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆ ప్రాంత ఉద్యోగులను ఆ ప్రాంతానికే తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. స్థానికతను నిర్ధారించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేయాలని, ఉద్యోగుల ఆప్షన్ ఫాంలో తల్లిదండ్రుల స్థానిక వివరాలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగులు కోరారు. సాధ్యమైనంత త్వరగా ఉద్యోగుల విభజన చేసి ఈ వివాదానికి ముగింపు పలకాలని వారు కోరుతున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments