Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్ సీఎంతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ

Webdunia
శనివారం, 5 మార్చి 2022 (11:07 IST)
జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌తో తెలంగాణ సీఎం భేటీ అయ్యారు. గాల్వాన్‌ లోయలో అమరులైన జవాన్ల కుటుంబాలకు జార్ఖండ్ సీఎంతో కలిసి 10 లక్షల రూపాయల చెక్కులను అందించారు. 
 
పీపుల్స్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై హేమంత్ సొరెన్‌తో కేసీఆర్ చర్చించారు. అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ హేమంత్ సోరెన్‌తో దేశ రాజకీయాలపై చర్చించినట్లు తెలిపారు. 
 
తెలంగాణ ఏర్పాటుకు శిబు సోరెన్ సహకరించారని గుర్తు చేశారు. త్వరలో అందరం కలుస్తామని చెప్పారు. దేశాభివృద్ధికి ఎలాంటి ప్రణాళిక కావాలో చర్చిస్తామని తెలిపారు. ఎవరికి అనుకూలం, ఎవరికి వ్యతిరేకమనేది కాదన్నారు. 
 
ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదని విమర్శించారు. 75 ఏళ్ల స్వాతంత్య్రంలో దేశం సరిగా అభివృద్ధి కాలేదని పేర్కొన్నారు. జార్ఖండ్ పర్యటన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుంటారు.
 
కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్.. నేతలతో వరుసగా సమావేశమవుతుండడం చర్చనీయాంశంగా మారింది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్ సీఎంతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments