Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై అత్యాచారం చేసిన స్నేహితులు - నిందితుల్లో ముగ్గురు మైనర్లు

Webdunia
ఆదివారం, 26 డిశెంబరు 2021 (18:45 IST)
గుజరాత్ రాష్ట్రంలోని డాంగ్ జిల్లాలో దారుణం జరిగింది. 14 యేళ్ల బాలికపై స్నేహితులే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే... డాంగ్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 14 యేళ్ల బాలిక రెండు నెలల క్రితం పక్క ఊరిలో జరిగిన ఓ వివాహానికి హాజరై ఇంటికి వస్తున్నది. ఆ సమయంలో ఆమెను మైనర్ స్నేహితుడు బలవంతంగా కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఆ తర్వాత తన స్నేహితులకు సమాచారం అందించాడు. దీంతో వచ్చే దారిలో మరో 8 మంది స్నేహితులు కలిసి ఆ బాలికను అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్ళి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యానికి పాల్పడిన వారిలో 9 మంది నిందితుల్లో ఆరుగురు 20 యేళ్ళలోపు వారు కాగా, మరో ముగ్గురు మైనర్లు. పైగా, వీరు చేసిన పాడుపని ఓ మైనర్ బాలుడు వీడియో తీశాడు. 
 
ఆ సమయంలో అటుగా వస్తున్న కొందరు వ్యక్తులను చూసి బాలికను అక్కడే వదిలివేసి పరారయ్యారు. పైగా, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బాలికను ఆ కామాంధులు బెదిరించారు. అయితే, ఈ అత్యాచారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
దీంతో బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు... కేసు నమోదు చేసి ఈ నెల 24వ తేదీన 9 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరిందరిపై పోక్సో చట్ట కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు గుజరాత్ రాష్ట్రంలో సంచలనంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments