Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళూరుకు కొత్త పేరు.. పోటీపడిన నెటిజన్లు... విజేతకు హైస్పీడ్ కారు

Webdunia
సోమవారం, 7 జూన్ 2021 (08:22 IST)
దేశ ఐటీ రాజధానిగా ఉన్న సిలికాన్ వ్యాలీ (బెంగుళూరు) నగరానికి కొత్త పేరు పెట్టేందుకు నెటిజన్లు పోటీపడ్డారు. వీరంతా కలిసి ఓ సరికొత్త పేరును సూచించారు. కర్నాటక రాష్ట్ర రాజధానిగా ఉన్న బెంగళూరుకు కొత్త పేరు సూచించేందుకు పోటీ పడాలని మహేంద్ర సంస్థ చైర్మన్‌ ఆనంద్‌మహేంద్ర పిలుపునిచ్చిన  విషయం తెల్సిందే. 
 
దీంతో నెటిజన్లు ఎన్నో పేర్లను సూచించారు. ప్రపంచ ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులలో ఒకరైన నందన్‌ నీలేకణి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. నగరానికి చెందిన శ్రీనివాస రెడ్డి అనే వ్యక్తి టెక్‌హళ్లిగా సూచించారు. ఇందుకు ఆనంద్‌ మహేంద్రతోపాటు నందన్‌ నీలేకణి సుముఖత వ్యక్తం చేశారు. 
 
టెక్‌హళ్లి అనే పదంలో టీఈసీ తర్వాత హెచ్‌ను కేపిటల్‌ లెటర్‌గా ప్రయోగించారు. తద్వారా ఒకే అక్షరం రెండు పదాలకు అర్థం వచ్చేలా ఉంది. ఈ పోటీలో విజేతగా నిలిచిన శ్రీనివాస రెడ్డికి పినిన్‌ఫరీనా హెచ్‌ 2 స్పీడ్‌ కారును బహుమతిగా అందజేయనున్నారు. దీన్ని స్వీకరించేందుకు చిరునామా పంపాలని ఆనంద్‌ మహేంద్ర ట్విట్టర్‌ ద్వారా శనివారం కోరారు. టెక్‌హళ్లి అంటే సాంకేతిక గ్రామం అని అర్థం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments