Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైల్లో పడ్డా గెలిచిన చిన్నమ్మ... 15 రోజుల్లో పళని ప్రభుత్వం పడిపోతుందా?

జయలలిత సమాధిపై శశి కసిగా కొట్టిన దెబ్బ సాక్షిగా బెంగళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ తన పంతాన్ని నెగ్గించుకుంది. రాబోయే నాలుగున్నరేళ్ల కాలం అంతా 'చిన్న'అమ్మ కనుసన్నల్లోనే పాలన సాగనుంది. ఎలాగూ మూడున్నరేళ్లలో జైలు నుంచి శిక్షా కాలాన్ని పూర్తి చేసు

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2017 (14:34 IST)
జయలలిత సమాధిపై శశి కసిగా కొట్టిన దెబ్బ సాక్షిగా బెంగళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ తన పంతాన్ని నెగ్గించుకుంది. రాబోయే నాలుగున్నరేళ్ల కాలం అంతా 'చిన్న'అమ్మ కనుసన్నల్లోనే పాలన సాగనుంది. ఎలాగూ మూడున్నరేళ్లలో జైలు నుంచి శిక్షా కాలాన్ని పూర్తి చేసుకుని బయటపడుతారు కనుక మిగిలిన ఒక సంవత్సరమంతా ఆమె తన ఇంటి దగ్గర నుంచి పాలన సాగించే అవకాశం ఉంది. 
 
గురువారం సాయంత్రం తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న పళని స్వామి మంత్రివర్గం జాబితాను చిన్నమ్మ కూర్చిందేనని అంటున్నారు. ఈ జాబితాలో తన కుటుంబ సభ్యులకు చెందిన ఇద్దరికి కీలక మంత్రి పదవులను కట్టబెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి. 
 
మరోవైపు జయలలిత చరిష్మాతో నిలబడిన అన్నాడీఎంకే పార్టీని శశికళ కుటుంబం చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం ఆరోపిస్తోంది. దీనిపై తాము న్యాయపోరాటం చేస్తామనీ, అసలు అన్నాడీఎంకే జాతీయ కార్యదర్శి పదవికి శశికళ ఎంపిక కూడా చట్టబద్ధం కాదనీ, ఆ ప్రకారంగా చూసినప్పుడు ఆమె ఎంపిక చేసిన పళని స్వామి కూడా అనర్హుడంటూ వారు వాదిస్తున్నారు. పదవి స్వీకరించగానే సరిపోదనీ, ఆయన ప్రభుత్వం మనజాలదనీ, గవర్నర్ బలనిరూపణ లోపే ఆ ప్రభుత్వం కూలిపోతుందని వారు అంటున్నారు. శశికళ ఆదేశాలపై వారు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మరి దీనిపై ఈసీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments