Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో పెళ్లి కోసం 9 నెలల బాబును అమ్మేసింది..

Webdunia
ఆదివారం, 3 అక్టోబరు 2021 (15:49 IST)
ఓ మహిళ అమ్మ తనానికే మచ్చ తెచ్చింది. మొదటి భర్తతో విడిపోయిన ఆ మహిళ రెండో పెళ్లి చేసుకునేందుకు అడ్డుగా ఉన్న 9 నెలల కన్నబిడ్డను డబ్బుకు అమ్మేసింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని విరుద్‌నగర్ జిల్లాలో జరిగింది. 
 
ఈ జిల్లాకు చెందిన మణికంఠన్ (38) అనే వ్యక్తికి, జెబమలర్ (28) అనే మహిళతో 2019లో వివాహం జరిగింది. వారికి కొద్ద రోజుల తర్వాత కొడుగు పుట్టాడు. పెళ్లైన ఏడాది వరకు బాగానే ఉన్నారు. కానీ ఆ తర్వాత వారి మధ్య చిన్న చిన్న గొడవలు తలెత్తాయి. ఇంతలో జెబమలర్ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. 
 
అయినప్పటికీ భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తీరిపోలేదు. దీంతో కలిసి ఉండడం ఇష్టం లేక విడాకులు తీసుకుని ఎవరికి వారు వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో జెబమలర్ బాబును తీసుకున్ని పుట్టింటికి వెళ్లింది. ఆమెకు రెండో పెళ్లి చేయాలనుకున్నారు. ఎన్ని సంబంధాలు చూసిన బిడ్డ ఉన్నాడనే కారణంతో ఎవరూ ముందుకు రాలేదు. తన రెండో పెళ్లికి కుమారుడే అడ్డుగా ఉన్నాడని జెబమలర్ ఓ ప్లాన్ చేసింది. ఎలాగైనా కుమారుడిని అమ్మేయాలని నిర్ణయించుకుంది.
 
తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి బ్రోకర్లను సంప్రదించింది. తమ వద్ద బాబు ఉన్నాడని పిల్లలు లేని వారికి తన కుమారుడిని అమ్ముతానని చెప్పింది. బ్రోకర్ల సాయంతో సెల్వమణి, శ్రీదేవి అనే దంపతులకు రూ.3 లక్షలకు 9 నెలల బాబును అమ్మేసింది. కుమారుడిని అమ్మేసిన విషయం తండ్రి మణికంఠన్‌కు తెలిసింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జెబమలర్‌తో పాటు..  బ్రోకర్లపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments